Refrigerator: ఫ్రిజ్‌ని కొద్దిసేపు ఆఫ్‌ చేస్తే కరెంట్‌ బిల్లు ఆదా అవుతుందా.. నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Turning Off the Fridge Does not Save the Current Bill Know the Real Facts
x

Refrigerator: ఫ్రిజ్‌ని కొద్దిసేపు ఆఫ్‌ చేస్తే కరెంట్‌ బిల్లు ఆదా అవుతుందా.. నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Highlights

Refrigerator Power Consumption: చాలా ఇళ్లలో ఫ్రిడ్జ్‌ అనేది రోజు మొత్తం నడుస్తూనే ఉంటుంది.

Refrigerator Power Consumption: చాలా ఇళ్లలో ఫ్రిడ్జ్‌ అనేది రోజు మొత్తం నడుస్తూనే ఉంటుంది. కొద్దిసేపు కూడా ఆఫ్‌ చేయరు. కానీ కొంతమంది తెలివిగా రోజులో కొన్ని గంటలు ఫ్రిడ్జ్‌ ఆఫ్‌ చేసి కరెంట్‌ బిల్‌ ఆదా చేశామనే భావనలో ఉంటారు. అంతేకాదు రోజు ఇలాగే చేసి కొంత వరకు కరెంట్‌ బిల్లు సేవ్‌ చేసుకోవచ్చని అనుకుంటారు. కానీ ఇది నిజంగా జరుగుతుందో లేదో వారికి తెలియదు. దీని గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం.

నిజానికి ఫ్రిడ్జ్‌ని కొన్నిగంటలు ఆఫ్‌ చేస్తే పవర్‌ ఆదా అవుతుందనే దానిలో నిజం లేదు. ఇలా అయితే మీరు పప్పులో కాలేసినట్లే అవుతుంది. వాస్తవానికి ఫ్రిడ్జ్‌ ఏడాది పొడవునా నడిచినా ఒక్క రోజు కూడా ఆఫ్ చేయకపోయినా ఎటువంటి తేడా ఉండదు. ఎందుకంటే ఫ్రిడ్జ్‌ ఆటోమేటిక్‌ కూలింగ్ వ్యవస్థని కలిగి ఉంటుంది. ఇందులో అమర్చిన టెంపరేచర్‌ సెన్సార్‌కి తక్కువ విద్యుత్‌ని వాడుకోవాలని తెలుసు. అవసరమైనప్పుడు మాత్రమే పవర్ వాడుకుంటుంది. అనవసరం అయినప్పుడు ఆఫ్‌ అవుతుంది.

ఈ పరిస్థితిలో ప్రతిరోజూ కొన్ని గంటలపాటు ఫ్రిడ్జ్‌ని ఆపివేస్తే ఎటువంటి విద్యుత్‌ ఆదాకాదు. కావాలంటే ఫ్రిడ్జ్‌ని శుభ్రం చేసేటప్పుడు కొన్ని గంటల పాటు ఆపివేయవచ్చు. కానీ ఎటువంటి పవర్‌ సేవ్‌కాదని గుర్తుంచుకోండి. అయితే ఒక్క విషయం మాత్రం మరిచిపోకూడదు. ఫ్రిడ్జ్‌ కూలింగ్‌ వ్యవస్థని సర్దుబాటు చేస్తూ కొంతవరకు విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories