TRAI New Rules: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై కాల్స్, మెస్‌జ్‌లకు కొత్త రూల్స్.. మే 1 నుంచే అమలు..!

TRAI New Rules From 1st May 2023 AI Filter for Calling and SMS Mobile
x

TRAI New Rules: మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై కాల్స్, మెస్‌జ్‌లకు కొత్త రూల్స్.. మే 1 నుంచే అమలు..!

Highlights

TRAI New Rules: ఇండియాస్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనలను మార్చాలని నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం, TRAI ఓ ఫిల్టర్‌ను సెటప్ చేసేందుకు సిద్ధమైంది. ఇది మే 1, 2023 నుంచి అమలుకానుంది.

New Mobile Calling, SMS Rules: ఇండియాస్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనలను మార్చాలని నిర్ణయించింది. కొత్త నిబంధనల ప్రకారం, TRAI ఓ ఫిల్టర్‌ను సెటప్ చేసేందుకు సిద్ధమైంది. ఇది మే 1, 2023 నుంచి ఫోన్‌లలో నకిలీ కాల్‌లు, SMSలను నిలిపివేస్తుంది. ఆ తర్వాత, వినియోగదారులు గుర్తు తెలియని కాల్‌లు, సందేశాల నుంచి ఉపశమనం దక్కనుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మే 1 నుంచి అమలు..

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఈ విషయంపై టెలికాం కంపెనీలకు వారి ఫోన్ కాల్స్, మెసేజ్ సర్వీస్‌లలో ఏఐ (కృత్రిమ మేధస్సు) స్పామ్ ఫిల్టర్‌లను ఇన్‌స్టాల్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. నకిలీ కాల్‌లు, సందేశాల నుంచి వినియోగదారులను రక్షించడంలో ఈ ఫిల్టర్ సహాయపడుతుంది. ఈ కొత్త రూల్ ప్రకారం, ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు సంబంధించిన అన్ని టెలికాం కంపెనీలు మే 1, 2023లోపు ఫిల్టర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.

జియోలో త్వరలో ఈ సదుపాయం ప్రారంభం..

దీనికి సంబంధించి, ఎయిర్‌టెల్ ఇప్పటికే ఇటువంటి AI ఫిల్టర్ల సదుపాయాన్ని ప్రకటించింది. ఈ కొత్త రూల్ ప్రకారం జియో తన సర్వీస్‌లలో AI ఫిల్టర్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి సిద్ధమవుతుందని ప్రకటించింది. ప్రస్తుతం, దీని గురించి పెద్దగా సమాచారం లేదు. అయితే భారతదేశంలో AI ఫిల్టర్‌ల అప్లికేషన్ మే 1, 2023 నుంచి ప్రారంభమవుతుందని అంటున్నారు.

ప్రమోషన్ కాల్‌లు నిషేధం..

ఫేక్ కాల్స్, మెసేజ్‌లను నిరోధించడానికి TRAI నియమాలను రూపొందించాలని యోచిస్తోంది. దీని ప్రకారం, 10 అంకెల మొబైల్ నంబర్‌లకు చేసే ప్రమోషనల్ కాల్‌లను నిలిపివేయాలని TRAI డిమాండ్ చేసింది. ఇది కాకుండా, TRAI కాలర్ ID ఫీచర్‌ను కూడా తీసుకువచ్చింది. ఇది కాలర్ పేరు, ఫోటోను ప్రదర్శిస్తుంది. టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, జియో కూడా ట్రూకాలర్ యాప్‌తో చర్చలు జరుపుతున్నాయి. అయితే కాలర్ ఐడి ఫీచర్‌ను అమలు చేయడం వల్ల గోప్యతా సమస్యలు రానున్నట్లు పేర్కొంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories