వాట్సాప్​ కి షాక్.. టెలిగ్రామ్ యాప్​లో అదిరిపోయే ఫీచర్లు

Telegram Announces New Feature Packed Update Monetization Plans for App
x

టెలిగ్రామ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Telegram News Features: ఇందులో భాగంగా వాయిస్​ ఛాట్​ సపోర్ట్​ను యాడ్​ చేసింది

Telegram News Features: వాట్సాప్​ షాకిస్తున్నారు వినియోగదారులు. కొత్త ప్రైవసీ పాలసీనే దీనికి ప్రధాన కారణం. ఇదే సమయంలో సిగ్నల్, టెలిగ్రామ్ డౌన్​లోడ్స్​ పెరిగాయి. టెలిగ్రామ్​ కొత్త ఫీచర్స్​ను తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులను మరింత మందిని చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా వాయిస్​ ఛాట్​ సపోర్ట్​ను యాడ్​ చేసింది. ఈ వాయిస్​ సపోర్ట్​ క్లబ్‌హౌస్ యాప్​లోని వాయిస్ చాట్ మాదిరిగానే పనిచేస్తుంది.

ఇక, టెలిగ్రామ్ తన ఛానెల్స్​లో వాయిస్​ చాట్​ సపోర్ట్​ను యాడ్​ చేసింది. వాయిస్​ చాట్​ ఎక్స్​పీరియన్స్​ను మరింత మెరుగుపర్చడం కోసం ఈ ఫీచర్ణు అందుబాటులోకి తెచ్చింది. వాయిస్ చాట్‌లతో యూజర్లు తమ స్నేహితులతో సులభంగా ఇంటరాక్ట్ కావొచ్చు. ఆయా గ్రూప్స్​లో ఛానెల్‌ నిర్వాహకులు అవసరాన్ని బట్టి నిర్దిష్ట తేదీ, సమయంలో వాయిస్ చాట్‌ను షెడ్యూల్ చేయవచ్చు.

అంతేకాక, ఈ వాయిస్ చాట్‌లకు మరిన్ని అదనపు ఫీచర్లను జోడించడానికి కొత్త అప్​డేట్​ను ప్రకటించింది. క్రొత్త అప్​డేట్​ ప్రకారం అన్ని టెలిగ్రామ్ చాట్‌ల కోసం పేమెంట్​ ఫీచర్​ను యాడ్​ చేసింది. అంతేకాక, వాయిస్ చాట్‌ల కోసం షెడ్యూలింగ్, మినీ ప్రొఫైల్‌లను అందుబాటులోకి తెచ్చింది. క్రొత్త అప్​డేట్​ ప్రకారం ఏదైనా చాట్‌లోని మెసేజెస్​ను, ఇన్వైట్ లింక్స్​ను టైమర్​ సెట్​ చేసుకొని ఆటో-డిలీట్ చేసుకోవచ్చు. తద్వారా, వేగంగా చాట్​ చేసుకునే అవకాశం కలుగుతుంది.

* ఆటోమేటిక్​గా మీ వాయిస్​ మెసేజ్​ గ్రూప్​ సభ్యులందరికీ పంపించబడుతుంది.

*ఈ వాయిస్​ చాట్​ను షెడ్యూల్ చేసుకోవడం కోసం అడ్మిన్​లు ఛానల్​ ఐకాన్​పైన అలాటే త్రీడాట్​ సెట్టింగ్స్​పైన ట్యాప్​ చేయాలి

*'స్టార్​ వాయిస్​ చాట్​' ఆప్షన్లు సెలక్ట్ చేసుకొని తర్వాత 'షెడ్యూల్​ వాయిస్​ చాట్​' ఆప్షన్​పై ట్యాప్​ చేయాలి.

* వాయిస్​ చాట్ షెడ్యూల్​ చేసుకోవడం కోసం కింద ఉన్న బటన్​పై ట్యాప్​ చేయాలి.

*​ నోటిఫికేషన్​ ఛానల్​ పైభాగంలో కనిపిస్తుంది.

*కొత్తగా వచ్చిన ఈ షెడ్యూలింగ్​ ఫీచర్​ హ్యాండీ ఎడిషన్​గా ఉంటుంది.

*టెలిగ్రామ్​ రెండు కొత్త​ వెబ్​ యాప్​లను కూడా జతచేస్తున్నట్లు తెలిపింది.

* యానిమేటెడ్ స్టిక్కర్లు, డార్క్ మోడ్, చాట్ ఫోల్డర్లు వంటి మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories