SMS-OTP Issues: బ్యాంకుల నుంచి ఓటీపీ, SMSలు రావడంలేదా? కారణం ఇదే

SMS-OTP Issues Faced by Telecom Users
x

SMS-OTP ఇష్యూ(ఇమేజ్ మార్కెటింగ్ ల్యాండ్ )

Highlights

SMS-OTP Issues: బ్యాంకు, ట్రాన్సాక్షన్లు, యూపీఐ బిల్లులు చెల్లింపులు చేస్తే ఓటీపీలు రావడం లేదా?

SMS-OTP Issues: మీ సెల్‌ఫోన్ వచ్చే మేసేజ్‌లు రావడం లేదా? బ్యాంకు, ట్రాన్సాక్షన్లు, యూపీఐ బిల్లులు చెల్లింపులు చేస్తే ఓటీపీలు రావడం లేదా? అయితే అసలు విషయం మీరు తెలుసుకోవాల్సిందే. రెండు రోజులుగా ఎస్ఎమ్ఎస్ సందేశాలు నిలిచిపోవడంతో మొబైల్ ఫోన్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కారణం తేలియక పలువురు ఆపరేటర్లకు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే అసలు విషయం ఏంటంటే.. ‎‎ట్రాయ్ సోమవారం నుంచి వచ్చిన SMS నిబంధనలు తీసుకోచ్చింది. ఈ నిబంధనలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వినియోగదార్లకు సందేశాలు చేరకపోవడంతో ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగులు, ఆధార్‌ ధ్రువీకరణ, కొవిన్‌ రిజిస్ట్రేషన్లు, ఇతర ఓటీపీ సేవల విషయంలో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీనికి కారణం ట్రామ్ వినియోగదారుడి సౌకర్యార్థం తెచ్చిన కొత్త నిబంధనలే. ఈ నిబంధనలను 7 రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ట్రాయ్‌ మంగళవారం తెలిపింది ఓటీపీలు రాకపోవడంతో పలు లావాదేవీలు, కోవిడ్ టీకా పేర్ల నమోదు అంశాల్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఈనెల 8 సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రధాన టెలికాం కంపెనీలు తమ ఎస్‌ఎమ్‌ఎస్‌ డేటాలను నమోదు చేసుకుని, వినియోగదార్లుకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాలని ట్రాయ్‌ సూచించింది. ఈ కొత్త నిబంధనలు 2018లో ట్రాయ్‌ రూపొందించింది ట్రాయ్ .

రూల్స్ ప్రకారం SMS నియంత్రణకు..ప్రతి టెలికాం కంపెనీ ఎస్‌ఎమ్‌ఎస్‌ లేదా ఓటీపీలను వినియోగదారుడికి పంపే ముందు రిజిష్టర్డ్ సందేశంతో ధృవికరించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఈ నిబంధనలను పాటించడం కోసం టెలికాం కంపెనీలు బ్లాక్‌చైన్‌ టెక్నాలజీని వినియోగించుకున్నాయి. ఇందులో రిజిస్టర్‌ ఐనా ఐడీల నుంచి వచ్చిన మెసెజ్ మాత్రమే చూసుకోని వినియోగదారుడికి పంపుతారు. దృవీకరించని ఐడీల నుంచి వచ్చే సందేశాలను నిలిపివేస్తారు. కొత్తగా తీసుకొచ్చిన బ్లాక్‌చైన్‌ ప్లాట్‌ఫాం (డిస్ట్రిబ్యూటెడ్‌ లెడ్జర్‌ టెక్నాలజీ)పై రిజిస్టర్‌ చేసుకోకపోవడంతో సోమవారం దాదాపు 40 శాతం వరకు సందేశాలు నిలిచిపోయాయి.

అయితే తాజా పరిణామాలపై బ్యాంకులు, టెలికాం కంపెనీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. మోసపూరిత సందేశాలు నిలిపేందుకే.. టెల్కోలు పంపే ఎస్‌ఎమ్‌ఎస్‌లపై నిబంధనలను వారం పాటు తాత్కాలికంగా నిలిపాం అని ట్రాయ్ ప్రకటించింది. వినియోగదార్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు ట్రాయ్ తెలిపింది. 34,000 కంపెనీలకు ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసినట్లు తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ ఛైర్మన్‌, సీఈఓ ఉదయ్‌ రెడ్డి తెలిపారు. నిబంధనల అమలుకు కంపెనీలు, టెలిమార్కెటర్లకు మరింత సమయాన్ని ట్రాయ్‌ ఇవ్వడంపై ఆయన ప్రశంశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories