Space: అంత‌రిక్షంలో కూడా ట్రాఫిక్ జామ్ కానుందా.? శాస్త్ర‌వేత్త‌లు ఏం చెబుతున్నారు

Space
x

Space: అంత‌రిక్షంలో కూడా ట్రాఫిక్ జామ్ కానుందా.? శాస్త్ర‌వేత్త‌లు ఏం చెబుతున్నారు

Highlights

Space: గత కొన్ని సంవత్సరాలుగా అంతరిక్షంలో శాటిలైట్‌ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోజుకో ప్రయోగం అన్నట్లుగా ప్రైవేట్‌ కంపెనీలు కూడా వేలకొద్దీ శాటిలైట్‌లను ఆకాశంలోకి పంపిస్తూ ఉన్నాయి.

Space: గత కొన్ని సంవత్సరాలుగా అంతరిక్షంలో శాటిలైట్‌ల సంఖ్య వేగంగా పెరుగుతోంది. రోజుకో ప్రయోగం అన్నట్లుగా ప్రైవేట్‌ కంపెనీలు కూడా వేలకొద్దీ శాటిలైట్‌లను ఆకాశంలోకి పంపిస్తూ ఉన్నాయి. ఇలా శాటిలైట్ పెరుగుదల వల్ల భవిష్యత్తులో భూమి చుట్టూ ఉన్న కక్ష్యలు పూర్తిగా నిండిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

ఒకప్పుడు ప్రభుత్వాలే ఉపగ్రహాలను ప్రయోగించేవి. ఇప్పుడు స్పేస్‌ఎక్స్ వంటి ప్రైవేట్ కంపెనీలు రంగంలోకి రావడంతో అంతరిక్షంలో శాటిలైట్‌ల కదలికలు గణనీయంగా పెరిగాయి. స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవల కోసం 7500 శాటిలైట్‌లు ఇప్పటికే భూమి చుట్టూ తిరుగుతున్నాయి. మొత్తం స్పేస్‌క్రాఫ్ట్‌లలో వీటి వాటా సుమారు 60 శాతం.

స్పేస్‌ఎక్స్ బాట‌లోనే అమెజాన్ కూడా ప్రాజెక్ట్ కూపియర్ పేరిట ప్రపంచవ్యాప్తంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించేందుకు శాటిలైట్ ప్రయోగాలు మొదలుపెట్టింది. అదే విధంగా చైనా "థౌజండ్ సెయిల్స్" అనే పేరుతో తన సొంత శాటిలైట్ మాలికను సిద్ధం చేస్తోంది. ఈ సంస్థల తాత్కాలిక లక్ష్యం – భూమి సమీప కక్ష్యలోనే వేగవంతమైన డేటా ప్రసారం.

స్పేస్‌ఎక్స్ రూపొందించిన ఫాల్కన్ 9 పునర్వినియోగ రాకెట్లు శాటిలైట్ ప్రయోగాలను తక్కువ ఖర్చుతో, ఎక్కువసార్లు చేయగలిగేలా మారుస్తున్నాయి. దీని వ‌ల్ల‌ ఏకకాలంలో వందల శాటిలైట్‌లను అంతరిక్షంలోకి పంపే అవకాశం ఉంది. దీంతో, మరిన్ని సంస్థలు ఈ రంగంలోకి వస్తున్నాయి.

శాస్త్ర‌వేత్త‌ల అభిప్రాయం ప్రకారం భూమి సమీప కక్ష్యంలో గరిష్ఠంగా 1,00,000 శాటిలైట్‌లు ఉండగలవని అంచనా. ప్రస్తుతం ఉన్న శాటిలైట్‌ల సంఖ్య సుమారుగా 11,700. ఇదే వేగంతో శాటిలైట్ ప్రయోగాలు కొనసాగితే 2050 నాటికి గరిష్ఠ పరిమితిని చేరుకోబోతున్నామని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

భవిష్యత్తులో శాటిలైట్‌లకు ట్రాఫిక్ జామ్?

గరిష్ఠ పరిమితికి చేరిన తర్వాత కొత్త శాటిలైట్‌ను ప్రయోగించాలంటే పాత శాటిలైట్‌ను తొలగించాల్సి వస్తుంది. లేకపోతే అవి ఒకదానికొకటి ఢీకొని ప్రమాదాలకు దారితీస్తాయి. కాబట్టే శాస్త్రవేత్తలు శాటిలైట్ క్రమబద్ధీకరణ, కచ్చితమైన కక్ష్య నియంత్రణ పై మరింత శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories