సామ్‌సంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలో నాలుగు బడ్జెట్ ఫోన్లు లాంచ్


సామ్‌సంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలో నాలుగు బడ్జెట్ ఫోన్లు లాంచ్
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ దేశీయ మార్కెట్లో కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. తాజాగా ఈ ఫోన్లను కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్‌లో టీజ్ చేసింది
Samsung Upcoming Budget Phones: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ దేశీయ మార్కెట్లో కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. తాజాగా ఈ ఫోన్లను కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్‌లో టీజ్ చేసింది. దీనిలో మోడల్ నంబర్‌తో పాటు కొన్ని ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. ఈ ఫోన్లు సామ్‌సంగ్ Galaxy A, Galaxy M, Galaxy F సిరీస్‌లలో లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లన్నీ 5G నెట్‌వర్క్ సపోర్ట్‌తో వస్తాయి. దీని పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం.
సామ్‌సంగ్ గెలాక్సీ A06, M16, F06, F16 5G ఫోన్లు కంపెనీ సైట్‌లో ఉన్నాయి. వీటిలో Galaxy A06, Galaxy F06 బడ్జెట్ ధరలలో విడుదల కానున్నాయి. ఈ రెండు ఫోన్‌లు రూ. 10,000 ప్రైస్ రేంజ్‌లో రావచ్చు. వాటి ఫీచర్లు కూడా దాదాపు ఒకే విధంగా ఉంటాయి. అలానే Galaxy M16 , Galaxy F16 దాదాపు ఒకే విధమైన ఫీచర్లతో లాంచ్ అవుతాయి. ఈ రెండు ఫోన్‌లు రూ.15,000 ధర పరిధిలోకి రావచ్చు. ఈ ఫోన్‌లన్నీ కొన్ని రోజుల క్రితం భారత వెబ్‌సైట్ BISలో కూడా కనిపించాయి.
సామ్‌సంగ్ గెలాక్సీ A06 మోడల్ నంబర్ SM-A066B/DS, గెలాక్సీ F06 SM-E066B/DS, గెలాక్సీ F16 SM-E166P/DS, గెలాక్సీ M16 SM-M166P/DSగా ఉన్నాయి. ఈ ఫోన్లన్నీ డ్యూయల్ సిమ్ కార్డ్, 5G నెట్‌వర్క్ సపోర్ట్‌తో వస్తాయి. కంపెనీ సపోర్ట్ పేజీలో ఈ ఫోన్ మోడల్ నంబర్లు కనిపిస్తున్నాయి.
సామ్‌సంగ్ గెలాక్సీ A06, F06 స్మార్ట్‌ఫోన్లు మెడిటెక్ డైమన్సిటీ 6300 ప్రాసెసర్‌పై రన్ అవుతాయి. ఈ రెండు ఫోన్‌లు 4GB RAMతో 128GB వరకు స్టోరేజ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌లు రానున్నాయి. గెలాక్సీ M16, గెలాక్సీ F16 ఫోన్లలో 6.7 అంగుళాల FHD+ డిస్ ప్లే ఉంటుంది. ఈ రెండు ఫోన్‌లలో మెడిటెక్ డైమన్సిటీ 6300 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ, 50MP ట్రిపుల్ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రెండు ఫోన్‌లను ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో లాంచ్ చేయచ్చని భావిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



