Samsung New M Series: సామ్‌సంగ్ నయా ఫోన్లు లాంచ్.. ధర ఎంతంటే..?

Samsung New M Series: సామ్‌సంగ్ నయా ఫోన్లు లాంచ్.. ధర ఎంతంటే..?
x

Samsung New M Series: సామ్‌సంగ్ నయా ఫోన్లు లాంచ్.. ధర ఎంతంటే..?

Highlights

Samsung New M Series: సామ్‌సంగ్ భారత్‌లో కంపెనీ ఫేమస్ గెలాక్సీ M సిరీస్‌లో 'Galaxy M16 5G, Galaxy M06 5G' స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు 5G కనెక్టివిటీతో ఉంటాయి.

Samsung New M Series: సామ్‌సంగ్ భారత్‌లో కంపెనీ ఫేమస్ గెలాక్సీ M సిరీస్‌లో 'Galaxy M16 5G, Galaxy M06 5G' స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. రెండు స్మార్ట్‌ఫోన్‌లు 5G కనెక్టివిటీతో ఉంటాయి. ఈ హ్యాండ్‌సెట్‌లు ఉత్తమ పనితీరు కోసం మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్‌తో వస్తాయి. ఫోన్‌లో పెద్ద డిస్‌ప్లే, గొప్ప కెమెరా, బలమైన బ్యాటరీ ఉంటాయి. ఈ ఫోన్లను బడ్జెట్ విభాగంలో తీసుకొచ్చారు. కొత్త గెలాక్సీ M16 5G ఫోన్‌కు ఆరు ఓఎస్ అప్‌గ్రేడ్‌‌లు, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందుకుంటుంది. ఇప్పుడు ఈ కొత్త హ్యాండ్‌సెట్‌ల ధర, ఇతర వివరాల గురించి తెలుసుకుందాం.

Samsung Galaxy M16 5G, Galaxy M06 5G Specifications

సామ్‌సంగ్ కొత్త గెలాక్సీ M16 5G ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్, 1080×2340 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల పూర్తి HD+ సూపర్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే పవర్ ఫుల్ కలర్స్, షార్ప్ విజువల్స్‌ను అందిస్తుంది. ఇందులో అడాప్టివ్ హై-బ్రైట్‌నెస్ మోడ్‌ కూడా ఉంది. గెలాక్సీ M06 5జీలో 6.7-అంగుళాల HD+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది.

రెండు స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పని చేస్తాయి. ఈ చిప్‌సెట్ Mali-G57 MC2 GPUతో వస్తుంది. చిప్‌సెట్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్‌ను నిర్వహిస్తుంది. మృదువైన మల్టీటాస్కింగ్, గేమింగ్ పనితీరును నిర్ధారిస్తుంది. గెలాక్సీ M16 5జీ మూడు ర్యామ్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. అందులో 4GB, 6GB, 8GB ఉన్నాయి. అయితే గెలాక్సీ M06 5జీ 4GB, 6GB RAM ఎంపికలలో అందుబాటులో ఉంది. వీటి ధరలు త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories