Samsung Galaxy M12: శాంసంగ్ గెలాక్సీ ఎం12 రిలీజ్

Samsung Galaxy M12 Launched in India
x

శాంసంగ్ గెలాక్సీ ఎం12 (ఫొటో ట్విట్టర్)

Highlights

Samsung Galaxy M12: శాంసంగ్ గెలాక్సీ ఎం12 స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. 6000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీని అందించారు.

Samsung Galaxy M12: శాంసంగ్ గెలాక్సీ ఎం12 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రిలీజ్ అయింది. ఇందులో 6000 ఎంఏహెచ్ బిగ్ బ్యాటరీని అందించారు. శాంసంగ్ గెలాక్సీ ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌ తో వచ్చిన ఈ ఫోన్.. అమెజాన్‌లో సేల్‌కు రానుంది.

ఇందులో 4 GB ర్యామ్ + 64 GB స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999 కాగా, 6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ మోడల్ ధర రూ.13,499గా ఉంది. అట్రాక్టివ్ బ్లాక్, ట్రెండీ ఎమరాల్డ్, ఎలిగెంట్ బ్లూ కలర్లో విడుదల చేశారు. మార్చి 18నుంచి సేల్ కు వస్తుంది.

ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ టీఎఫ్‌టీ ఇన్‌ఫినిటీ-వి డిస్ ప్లేను అందించారు. ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ వర్క్ చేస్తుంది. మొమోరీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇందులో బ్యాక్ సైడ్ 4 కెమెరాలు అందించారు. వీటిలో మెయిన్ కెమెరా సామర్థ్యం 48 MP కాగా, 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP మాక్రో సెన్సార్, 2 MP డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 8 MP కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 6000 MAH ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సైడ్ కు అందించారు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు ఆకట్టుకోనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories