Samsung Galaxy A56 5G: మరో కొత్త మొబైల్ లాంచ్ చేసిన సామ్‌సంగ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే..!


Samsung Galaxy A56 5G: సామ్‌సంగ్ గెలాక్సీ A56 5జీ ఫోన్‌లో 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇందులో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది.
Samsung Galaxy A56 5G: సామ్‌సంగ్ ను విడుదల చేసింది. కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్‌లో 'Samsung Galaxy A56 5G' ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫోన్ కంపెనీ ప్రీమియం మొబైల్ గెలాక్సీ ఎస్25ని పోలి ఉంటుంది. ఫోన్ కలర్స్‌లో లాంచ్ అయింది. ఇందులో 12జీబీ ర్యామ్ కూడా ఉంది. ఈ మొబైల్ ముందు, వెనుక రెండింటిలో గొరిల్లా గ్లాస్ విక్టస్+ ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్స్, పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Samsung Galaxy A56 5G Features
సామ్‌సంగ్ గెలాక్సీ A56 5జీ ఫోన్‌లో 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇందులో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ 1,080 x 2,340 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్,1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లేలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ టెక్నాలజీ ఉంది. అలానే డిస్‌ప్లేకి గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటక్షన్ అందించారు.
ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Exynos 1580 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ని 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్‌లో తయారు చేశారు. ఫోన్ వన్ UI 7 ఆధారంగా ఆండ్రాయిడ్ 15లో రన్ చేస్తుంది. మొబైల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ మూడవ కెమెరా ఉన్నాయి. వీడియో కాలింగ్ కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
సామ్‌సంగ్ గెలాక్సీ A56 5G ఫోన్ 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. ఫోన్ ఐ కేర్ స్క్రీన్‌ని ఉపయోగిస్తుంది. ఈ మొబైల్‌లో 3.5మిమీ హెడ్‌ఫోన్ జాక్, USB టైప్ C ఆడియో, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో 5GHz Wi-Fi, బ్లూటూత్ 5.3, NFC ఉన్నాయి.
Samsung Galaxy A56 5G Price
ఈ మొబైల్ అద్భుతమైన లైట్ గ్రే, గ్రాఫైట్, ఆలివ్, పింక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 43,735కి విడుదల చేశారు. అలాగే, 8GB + 256GB స్టోరేజ్ మోడల్‌ను రూ. 48,000కి పరిచయం చేశారు. ఈ సామ్‌సంగ్ ఫోన్‌లో 12జీబీ ర్యామ్ ఉంది. ఫోన్ సామ్‌సంగ్ ఎక్సినోస్ 1580 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్ బాడీ మెటల్‌తో ఉంటుంది. ముందు, వెనుక రెండింటిలో గొరిల్లా గ్లాస్ విక్టస్+ ఉంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



