Jio Recharge Plan: జియో నుంచి సూపర్ ప్లాన్.. రూ. 7కే 2జీబీ డేటా, 28 రోజులు అన్‌లిమిటెడ్ కాలింగ్..!

Jio Recharge Plan: రిలయన్స్ జియో రూ. 189 మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో అన్‌లిమిటెడ్ కాలింగ్, 2జీబీ డేటా లభిస్తుంది.

Jio Recharge Plan
X

Jio Recharge Plan

Jio Recharge Plan: ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచాయి. ఈ పరిస్థితిలో ప్రతి మొబైల్ ఫోన్ వినియోగదారుడుకు ఫోన్‌ను రీఛార్జ్ చేయడం మునుపటి కంటే భారంగా మారింది. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో నెలకు రూ. 190 కంటే తక్కువ ధరతో ఉచితంగా అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు మీ దృష్టి దీని వైపు పడుతుంది. Jio తన నెట్వర్క్ వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్‌ను అందిస్తుంది. దీనిలో మీరు రోజుకు రూ. 7 కంటే తక్కువ ధరతో డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు. జియో ఈ చౌకైన ప్లాన్ ఒక నెల పాటు ఉంటుంది. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం.

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో రూ. 189 మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. మంచి విషయం ఏమిటంటే జియో ఈ చౌక రీఛార్జ్ ప్లాన్‌తో వినియోగదారులు నెల పొడవునా ఉచితంగా అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఇది మాత్రమే కాద జియో వినియోగదారులకు ఈ ప్లాన్‌తో డేటా ప్రయోజనాలు కూడా పొందుతారు.

జియో రూ.189 ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో 2 జీబీ డేటా లభిస్తుంది. అలానే అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను ఎంజాయ్ చేయవచ్చు. డైలీ 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు వస్తాయి. వీటితో పాటు JioTV, JioCinema, JioCloud ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. జియో ఈ ప్లాన్ ఎక్కువ డేటా అవసరం లేని వినియోగదారులకు ఉపయోగపడుతుంది.

Jio ఈ ప్లాన్ ఇంట్లో కార్యాలయంలో WiFi సౌకర్యం ఉన్న వినియోగదారులకు సరైన రీఛార్జ్ ప్లాన్. నెల పొడవునా కాల్ చేయడానికి ఇది చౌక రీఛార్జ్ ప్లాన్. ఫోన్‌లో ఉన్న డేటా ఇల్లు, కార్యాలయానికి దూరంగా ఉన్నప్పుడు కూడా ఉపయోగించబడుతుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ చౌVక ప్లాన్‌లో నెలకు 2GB డేటా అందిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story