To Day Best Deals: బెస్ట్ డీల్స్.. తక్కువ ధరకే అదిరిపోయే బ్రాండెడ్ ఫోన్లు..!

To Day Best Deals: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో రెడ్‌మీ, వన్‌ప్లస్, పోకో ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Vamsi Krishna
Published on: 10 Aug 2024 5:46 PM IST
Today Best Deals
X

Today Best Deals

Today Best Deals: ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ వరుస సేల్స్‌తో ఆఫర్లు వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలోనే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌ను ప్రకటించింది. ఈ ఫెస్టివల్ సేల్‌లో ఫోన్‌లపై బ్యాంక్ డిస్కౌంట్లను అందిస్తుంది. ఫోన్‌లను నో కాస్ట్ EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అందజేస్తున్నారు. మీరు వన్‌ప్లస్ నుంచి రెడ్‌మీ వరకు చాలా ఫోన్‌లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. వీటిలో 128 జీబీ ర్యామ్+256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఈ క్రమంలో అందుబాటులో ఉన్న టాన్ డీల్స్ గురించి ఇవాళ తెలుసుకుందాం

POCO X6 Neo 5G
ఈ Poco స్మార్ట్‌ఫోన్ 12GB RAMతో 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్ 6.67 అంగుళాల Full HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. హ్యాండ్‌సెట్‌లో Mediatek డైమెన్సిటీ 6080 6nm ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. ఫోన్ 108MP మెయిన్ కెమెరాతో వస్తుంది. ఇది 5000mAh బ్యాటరీతో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అమెజాన్‌లో ఈ ఫోన్ ధర రూ.15,749. సేల్‌లో SBI కార్డ్‌లపై రూ. 1000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

OnePlus Nord 4 5G
వన్‌ప్లస్ ఈ 5G స్మార్ట్‌ఫోన్‌లో 12GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. హ్యాండ్‌సెట్ 5500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Amazonలో దీని ధర రూ.35,998. మీరు అమెజాన్ నుండి కొనుగోలు చేస్తే SBI కార్డ్‌పై 2000 రూపాయల తగ్గింపు లభిస్తుంది

Redmi Note 13 5G
ఈ 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ 12GB RAM +256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 108MP మెయిన్ కెమెరా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో 6.67 అంగుళాల ఫుల్ పోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఈ హ్యాండ్‌సెట్ Mediatek Dimensity 6080 6nm ఆక్టా-కోర్ 5G ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోన్ ధర రూ.19,999. ప్రస్తుతం. మీరు అమెజాన్ నుండి కొనుగోలు చేస్తే SBI కార్డ్‌పై 1000 రూపాయల డిస్కౌంటమ్ లభిస్తుంది.

Vamsi Krishna

Vamsi Krishna

Next Story