Redmi Note 14 Pro: దుమ్ములేపుతుంది.. రెడ్‌మి నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. కెమెరా యూనిట్ నెక్స్ట్ లెవల్..!

Redmi Note 14 Pro: రెడ్‌మి నోట్ 14 సిరీస్‌‌లో ప్రో స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ చేయనుంది. ఫోన్ ఫీచర్స్ లీక్ అయ్యాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 23 Sept 2024 7:51 PM IST
Redmi Note 14 Pro
X

Redmi Note 14 Pro

Redmi Note 14 Pro: ప్రస్తుతకాలంలో స్మార్ట్‌ఫోన్ లేని మనిషే లేడు. ఓ పూట తిండైనా మానుకుంటారేమో గానీ, స్మార్ట్‌ఫోన్ లేకుండా ఓ క్షణం కూడా ఉండలేరు. ఈ టెక్నాలజీ యుగంలో స్మార్ట్‌ఫోన్ అవసరంగా మారింది. నిద్రలేచి ఇంట్లో కూరగాయలు కొనే దగ్గర నుంచి పడుకోనేప్పుడు ఏసీ కట్టేసే వరకు అన్నీ పనులు స్మార్ట్‌ఫోన్‌తోనే స్మార్ట్‌‌గా చేస్తున్నారు. అందుకనే దేశీయ మార్కెట్‌లో టెక్ కంపెనీలు పోటీపడుతున్నాయి. వరుసగా ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నోట్ 14 సిరీస్‌ను పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. 14 లైనప్‌లో రెడ్‌మి నోట్ 14, నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్ రానున్నాయి. రెడ్‌మి నోట్ 13 సిరీస్ గ్రాండ్ సెక్సస్ తర్వాత నోట్ 14 లాంచ్ సంచలనం సృష్టించింది. తాజాగా ఓ టెక్ వీరుడు రెడ్‌మి నోట్ 14 ప్రో స్పెసిఫికేషన్లు లీక్ చేశాడు. అయితే వీటిని అధకారికంగా ధృవీకరించలేదు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Redmi Note 14 Pro Specifications
రెడ్‌మి Note 14 ప్రో స్మార్ట్‌ఫోన్ 120 Hz రిఫ్రెష్ రేట్ ప్యానెల్, 445 PPI పిక్సెల్‌తో 6.67 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ 2,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లేకి గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటక్షన్ అందించారు. స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్‌తో పాటు 16GB RAM + 512 UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. ఇది 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ 5,500 mAh బ్యాటరీతో రావచ్చు. ఫోన్ Android 14 ఆధారంగా HyperOS అవుట్ ఆఫ్ ది బాక్స్‌ రన్ అవుతుంది.

లీకైన సమాచారం ప్రకారం రెడ్‌మి నోట్ 14 ప్రో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రావచ్చు. ఇది OIS సపోర్ట్‌తో 50 MP మెయిన్ సెన్సార్, 12 MP అల్ట్రావైడ్ లెన్స్‌ కలిగి ఉంటుంది. ఇది 4K వీడియో రికార్డింగ్‌తో 2 MP మాక్రో సెన్సార్‌ను కూడా పొందవచ్చు. సెల్ఫీల కోసం స్మార్ట్‌ఫోన్ 1080p రికార్డ్ చేయగల 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రావచ్చు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story