Realme Neo 7 SE: IR బ్లాస్టర్ ఫీచర్‌తో రియల్‌మి కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

Realme Neo 7 SE
x

IR బ్లాస్టర్ ఫీచర్‌తో రియల్‌మి కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

Highlights

Realme Neo 7 SE: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మి సంస్థ తమ కస్టమర్స్ కోసం కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ "Realme...

Realme Neo 7 SE: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మి సంస్థ తమ కస్టమర్స్ కోసం కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఫోన్ "Realme Neo 7 SE" పేరుతో మార్కెట్లో సందడి చేయనుంది. కొన్ని రోజుల క్రితం ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను కూడా వెల్లడించింది. ప్రస్తుతానికి ఈ ఫోన్ లాంచింగ్‌కు సంబంధించి రియల్‌మి ఎటువంటి అధికారిక వివరాలను పంచుకోలేదు. అయితే లీకులు మాత్రం వరుసగా బయటకు వస్తున్నాయి.

రియల్‌మి నియో 7 SE మిడ్-రేంజ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్. ఇది ప్రత్యేకమైన డిజైన్‌తో గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇటీవల ఈ స్మార్ట్‌ఫోన్ ఫోటోలు, వివరాలు TENAA లిస్టింగ్‌లో కనిపించాయి. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు కూడా ఇక్కడ చూడచ్చు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Vivo, Oppo ఫోన్‌లకు రియల్‌మి ప్రత్యక్ష పోటీని ఇస్తుంది.

రియల్‌మి నియో 7 SE డైమన్సిటీ 8400 మాక్స్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ 6850mAh పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల AMOLED ప్యానెల్ డిస్‌ప్లే చూస్తారు.

స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో LED ఫ్లాష్‌తో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ కెమెరా సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.

రియల్‌మి నియో 7 SEని మూడు వేరియంట్లలో లాంచ్ చేయచ్చు. ఇందులో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 12GB ర్యామ్ + 256GB స్టోరేంజ్, 15GB ర్యామ్+ 512GB, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. సేఫ్టీ కోసం ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇదే కాకుండా స్మార్ట్ గ్యాడ్జెట్లను కంట్రోల్ చేయడానికి IR బ్లాస్టర్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories