రియల్‌మి నుంచి చౌకైన ఏసీ లాంచ్‌.. ధర, ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Realme New Split AC Models Launched Check for all Details
x

రియల్‌మి నుంచి చౌకైన ఏసీ లాంచ్‌.. ధర, ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Highlights

Realme Split AC: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రియల్‌మి మొబైల్స్‌, ఆడియో ఉత్పత్తులు, ఎల్‌ఈడీ టీవీల తర్వాత ఇప్పుడు కొత్తగా ఏసీని విడుదల చేసింది.

Realme Split AC: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రియల్‌మి మొబైల్స్‌, ఆడియో ఉత్పత్తులు, ఎల్‌ఈడీ టీవీల తర్వాత ఇప్పుడు కొత్తగా ఏసీని విడుదల చేసింది. ఈ ఎయిర్ కండీషనర్ ప్రత్యేకత ఏంటంటే 4-ఇన్-1 కన్వర్టర్ ఇన్వర్టర్ AC మోడల్. ఇందులో మీరు అనేక ఫీచర్లను చూస్తారు. ఈ రియాలిటీ AC అన్ని ఫీచర్లు, ధర గురించి తెలుసుకుందాం.

రియల్‌మి ఎయిర్ కండీషనర్

ఈ ఏసీ ప్రత్యేకత ఏంటంటే ఇది 4 in 1 కన్వర్టబుల్ ఇన్వర్టర్ AC. కానీ మీరు ఫ్లెక్సీ కంట్రోల్ టెక్నాలజీని కూడా పొందుతారు. ఈ టెక్నాలజీ సాయంతో ఏసీని వ్యక్తులను బట్టి వివిధ రేంజ్‌లలో సెట్‌ చేసుకోవచ్చు. ఈ సరికొత్త ఏసీ మోడల్ ప్రత్యేక లాంచ్ ఆఫర్‌తో రూ.27 వేల 999 ప్రారంభ ధరతో విడుదలైంది. దీని మోడల్ ధర రూ.33 వేల 999 వరకు పెరుగుతుందని అంచనా. అంటే మీరు 1 టన్ను నుంచి 1.5 టన్ను వరకు ఈ మోడల్‌ను పొందుతారు. మీరు ఈ ఏసీని ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మి ఇన్వర్టర్ ఏసీ ఫీచర్లు

ఈ ఏసీలో ర్యాపిడ్ కూల్ ఫీచర్ ఉంటుంది. ఇది గాలి ప్రవాహాన్ని పెంచుతుంది. కంపెనీ ప్రకారం ఈ ఫీచర్ 20 నిమిషాల్లో తక్షణ కూలింగ్‌ను అందిస్తుంది. గదిని త్వరగా చల్లబరుస్తుంది. అదనంగా ఇది ఇన్వర్టర్ టెక్నాలజీ వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్‌తో వస్తుంది. ఇది వేగంగా మెరుగైన శీతలీకరణ ఆపరేషన్‌లో సహాయపడుతుంది.

ఈ ఏసీలు 165V నుంచి 265V వరకు ఉన్న వోల్టేజ్ రకాలని మెయింటెన్‌ చేయగల శక్తిని కలిగి ఉండే ఇన్-బిల్ట్ స్టెబిలైజర్‌తో వస్తాయి. కాయిల్స్ రక్షణ కోసం కంపెనీ బ్లూ ఫిన్ టెక్నాలజీని ఉపయోగించింది. ఈ ఏసీ మోడల్స్ అన్నీ R32 గ్యాస్‌తో వస్తాయి. ఇవి పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించవు. ఈ ఏసీలో మీరు ఆటో / డ్రై, ఎకో, వంటి కూలింగ్ మోడ్‌లను పొందుతారు. కంపెనీ 10-సంవత్సరాల కంప్రెసర్ వారంటీని అందిస్తోంది. ఇవి డిగ్రీల వేడిలో కూడా మీకు చల్లదనాన్ని అందించేలా పనిచేస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories