Realme Narzo N53: రియల్ మీ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. రూ.9వేలకే నార్జో N53

Realme Narzo N53 Budget Friendly Moblie For 90000 Rupees
x

Realme Narzo N53: రియల్ మీ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. రూ.9వేలకే నార్జో N53

Highlights

* ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ..సరికొత్త ఫీచర్లతో కొత్త ఫోన్లను చైనా దిగ్గజ మొబైల్ ఫోన్ కంపెనీ రియల్ మీ అందుబాటులోకి తెస్తోంది.

Realme Narzo N53: ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ..సరికొత్త ఫీచర్లతో కొత్త ఫోన్లను చైనా దిగ్గజ మొబైల్ ఫోన్ కంపెనీ రియల్ మీ అందుబాటులోకి తెస్తోంది. తాజాగా రియల్ మీ నార్జో N53 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. అధునాతన ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ గా ఉండడం విశేషం.

రియల్ మీ నుంచి మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చేసింది. సరికొత్త ఫీచర్లతో కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ వస్తున్న ఈ చైనా దిగ్గజ మొబైల్ కంపెనీ తాజాగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ తీసుకొచ్చింది. రియల్ మీ నార్జో ఎన్ 53 పేరుతో లాంఛ్ చేసిన ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లు, రెండు రంగుల్లో అందుబాటులోకి తెచ్చింది. నార్జో సిరీస్ లో ఇది రెండవది. ఐఫోన్ 14ప్రో లో మాదిరిగా మినీ క్యాప్సూల్ ఫీచర్ ఈ ఫోన్ సొంతం. 4జీబీ రామ్ 64 జీబీ మోడల్ ధర రూ.8,999 కాగా 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999 ఉంది.

స్పెసిఫికేషన్స్:

అత్యంత స్లిమ్ గా ఉండే రియల్ మీ నార్జో ఎన్ 53..ఒక్టాకోర్ యూనిసోక్ టీ612 చిప్ సెట్ తో వస్తోంది. 5000mAh బ్యాటరీ సామర్థ్యంతో 33w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఎంట్రీ లెవల్ రియల్ మీ నార్జో ఎన్ 53ఫోన్ ఆండ్రాయిడ్ 13విత్ రియల్ మీ యూఐ 4.0 వర్షన్ పై పని చేస్తుంది. రియల్ మీ మినీ క్యాప్సూల్ ఫీచర్ కూడా జత చేశారు. ఈ రియల్ మీ నార్జో ఎన్ 53 సిరీస్ లో 50 మెగా పిక్సెల్ ఏఐ ప్రైమరీ సెన్సార్ తో పాటు డ్యూయల్ రేర్ కెమెరా యూనిట్ కలిగి ఉంది. సెల్ఫీల కోసం ఫ్రంట్ లో 8 మెగా పిక్సెల్ కెమెరాను అమర్చారు.

డిస్కౌంట్స్ :

హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కార్డు హోల్డర్లకు రూ.1000 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ నెల 24 నుంచి రియల్ మీ ఆన్ లైన్ స్టోర్, అమెజాన్ లో కొనుగోలు చేసుకోవచ్చు. ఫస్ట్ సేల్ లో భాగంగా బేస్ వేరియంట్ ఫోన్ మీద రూ.500, హై వేరియంట్ ఫోన్ పై రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ నెల 22 మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు 4జీబీ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియెంట్ ఫోన్ పై రూ.750, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ పై రూ.1000 వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories