Realme V60: తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? రియల్‌మీ వీ60 బెస్ట్ ఆప్షన్‌..!

Realme v60: తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? రియల్‌మీ వీ60 బెస్ట్ ఆప్షన్‌

Realme launches new smart phone Realme v60 series in china, check here for features and price details
X

Realme v60: తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.? రియల్‌మీ వీ60 బెస్ట్ ఆప్షన్‌

Realme v60: ప్రస్తుతం 5జీ ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరిస్తున్న నేపథ్యంలో 5జీ ఆధారిత ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు ప్రజలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీలు ఫోన్‌ల ధరలను భారీగా తగ్గిస్తున్నాయి. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌ మీ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ వీ60 సిరీస్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తొలుత చైనా మార్కెట్లో లాంచ్‌ చేయగా. త్వరలోనే భారత్‌లోకి తీసుకురానున్నారు. రియల్‌మీ వీ60 ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 చిప్‌సెప్‌ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. 8 జీబీ ర్యామ్‌తో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఇందులో 10 వాట్స్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఈ 5జీ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. రియల్‌మీ వీ60 ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. 720x1,604 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 625 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ ఫోన్‌ సొంతం. 50 హెచ్‌జెడ్‌ నుంచి 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో ఈ స్క్రీన్‌ ఉండనుంది. ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 13,800కాగా, 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 16,100గా ఉండనుంది. అయితే భారత్‌లో లాంచ్‌ అయిన సమయంలో ధరలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story