Realme P3 Pro 5G Price Drop: వావ్..! అలాంటి అవకాశం మళ్లీ రాదు.. రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!

Realme P3 Pro 5G Price Drop
x

Realme P3 Pro 5G Price Drop: వావ్..! అలాంటి అవకాశం మళ్లీ రాదు.. రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్..!

Highlights

Realme P3 Pro 5G Price Drop: వావ్..! అలాంటి అవకాశం మళ్లీ రాదు. టెక్ కంపెనీ రియల్‌మీ 'Realme P3 Pro 5G' ఫోన్‌ను రూ. 2,000 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. విడుదలైన నెల రోజుల్లోనే ఈ ఫోన్ ధర భారీగా తగ్గడం గమనార్హం.

Realme P3 Pro 5G Price Drop: వావ్..! అలాంటి అవకాశం మళ్లీ రాదు. టెక్ కంపెనీ రియల్‌మీ 'Realme P3 Pro 5G' ఫోన్‌ను రూ. 2,000 తగ్గింపు ధరకు విక్రయిస్తోంది. విడుదలైన నెల రోజుల్లోనే ఈ ఫోన్ ధర భారీగా తగ్గడం గమనార్హం. రియల్‌మీ ప్రేమికులు ఈ ఫోన్‌ను కొనడానికి ఇప్పిటికే పోటీపడుతున్నారు. రండి.. ఈ రియల్‌మీ 5G ఫోన్‌‌పై అందుబాటులో ఉన్న ఆఫర్స్, స్పెసిఫికేషన్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

కంపెనీ Realme P3 Pro 5G ఫోన్‌ బేస్ వేరియంట్‌ను రూ 23,999కి విడుదల చేసింది. ఇప్పుడు మొబైల్ అన్ని వేరియంట్లపై 2,000 బ్యాంక్ డిస్కౌంట్. ఆఫ్‌లైన్ మార్కెట్‌లో కూడా ఈ Realme ఫోన్ కొనుగోలుపై రూ. 2,000 తగ్గింపు అందుబాటులో ఉంది. మీరు రిటైల్, మొబైల్ స్టోర్స్ నుండి కొనుగోలు చేయచ్చు. ఈ Realme 5G మొబైల్ నెబ్యులా గ్లో, గెలాక్సీ పర్పుల్,సాటర్న్ బ్రౌన్ కలర్ ఆప్షన్స్ అందుబాటులో ఉంది.

Realme P3 Pro 5G Features And Specifications

రియల్‌‌మీ P3 Pro 5G మొబైల్‌లో 6.83 అంగుళాల ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది.ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ మొబైల్‌లో వెట్ టచ్ టెక్నాలజీ కూడా ఉంది. తడి చేతులతో కూడా ఈ ఫోన్ ఉపయోగించవచ్చు.

స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7S జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌తో పనిచేస్తుంది. మొబైల్‌లో 8జీబీ ర్యామ్, 12జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 16-మెగాపిక్సెల్ షూటర్ ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్‌లో 6000mAh కెపాసిటీ గల బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 80W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. ఈ మొబైల్‌ని వాటర్, డస్ట్ నుంచి ప్రొటక్ట్ చేయడానికి IP69 రేటింగ్ ఇచ్చారు. అలానే AI ఎరేస్, బెస్ట్ ఫేస్, మోషన్ బ్లర్, AI రికార్డింగ్, AI రైటర్, సెర్చ్ చేయడానికి Google సర్కిల్, AI రిప్లైతో సహా అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories