Realme C21Y Mobile: రియల్‌మీ నుంచి కొత్త ఫోన్.. ధర రూ.10 వేలలోపే!

Realme C21y To Launch Soon With Android Go Edition Details
x

రియల్‌మీ సీ21వై (ఫొటో ట్విట్టర్)

Highlights

Realme C21Y Mobile: రియల్‌మీ నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. రియల్‌మీ సీ21వై పేరుతో ఈ ఫోన్ రానుంది.

Realme C21Y Launch Date in India: రియల్‌మీ నుంచి మరో కొత్త ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. రియల్‌మీ సీ21వై పేరుతో ఈ ఫోన్ రానున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు ఈ ఫోన్ స్పెషిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ తో ఈ ఫోన్ లాంచ్ కానున్నట్లు టాక్. కాగా, ఆండ్రాయిడ్ గో ఓఎస్‌తో విడుదలయ్యే మొదటి ఫోన్‌ కానుంది.

ఈ ఫోన్‌ మొదట వియత్నాంలో విడుదల కానుందని టిప్‌స్టర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ సీ21వై పనిచేయనుంది. బ్లాక్, బ్లూ కలర్లలో ఈ ఫోన్ విడుదల కానుంది. అయితే ధర మాత్రం రూ.10 వేల లోపే ఉండొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, ఆక్టాకోర్ యూనిసోక్ టీ610 ప్రాసెసర్‌, అలాగు 5000 ఎంఏహెచ్‌గా బ్యాటరీ ఉండనున్నాయని సమాచారం. అలాగే 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

4 GB ర్యామ్, 64 GB స్టోరేజ్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో వెనకవైపు 3 కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా 13 MP కాగా, దీంతోపాటు 2 MP డెప్త్ సెన్సార్, 2 MP మాక్రో కెమెరా కూడా అందించనున్నారు. ఇక ముందుభాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 MP కెమెరాను అందించారు.

వీటితో పాటు 4జీ, వైఫై, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, జీపీఎస్/ఏ-జీపీఎస్, బ్లూటూత్ వీ5, మైక్రో యూఎస్‌బీ పోర్టు వంటి కనెక్టివిటీ సెన్సార్లు కూడా ఇందులో ఉన్నాయి. అలాగే ఫోన్ బ్యాక్‌సైడ్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories