Realme 14x 5G: రియల్‌మి నుంచి బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే అస్సలు నమ్మలేరు..!

Realme 14X 5G Launched With 6000mAh Battery
x

Realme 14x 5G: రియల్‌మి నుంచి బడ్జెట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే అస్సలు నమ్మలేరు..!

Highlights

Realme 14x 5G: టెక్ బ్రాండ్ రియల్‌మి భారత్‌లో కొత్త బడ్జెట్ 5జీ ఫోన్‌ను విడుదల చేసింది.

Realme 14x 5G: టెక్ బ్రాండ్ రియల్‌మి భారత్‌లో కొత్త బడ్జెట్ 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. ఈ బడ్జెట్‌ ఫోన్‌ను Realme 14x 5G పేరుతో తీసుకొచ్చారు. ఫోన్‌లో 6000mAh కెపాసిటీ పెద్ద బ్యాటరీ ఉంది. అలానే 50 మెగాపిక్సెల్ కెమెరా, మెడిటెక్ డైమన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంది. ఈ మొబైల్‌లో 6.67-అంగుళాల డిస్‌ ప్లే, 128GB స్టోరేజ్, 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. కంపెనీ ఇప్పుడు 256GB స్టోరేజ్ వేరియంట్‌ను విడుదల చేసింది. రూ.15,000 బడ్జెట్‌లో కొత్త మొబైల్ కొనాలనుకొనే వారికి ఈ ఫోను మంచి ఆప్షన్. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే స్టైలిష్ లుక్స్, అద్భుతమైన ఫీచర్లతో మొబైల్ ప్రియులను ఆకర్షిస్తోంది.

రియల్‌మి 14x 5G ఫోన్ 6GB + 128GB, 8GB + 128 స్టోరేజ్ ఆప్షన్స్‌లో విడుదల చేసింది. ప్రస్తుతం 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ మాత్రమే గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఈ వేరియంట్ ధర రూ.22,250గా ఉంది. ఈ ఫోన్ 128GB స్టోరేజ్ ధర రూ.14,999. 128GB స్టోరేజ్ వేరియంట్ దేశంలో రూ.15,999కి అందుబాటులో ఉంది. ఫోన్‌ను కార్బన్ బ్లాక్, పెరిడాట్ గ్రీన్ కలర్స్‌లో అర్డర్ చేయవచ్చు. మీరు ఈ మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుక్ చేయవచ్చు.

రియల్‌మి 14x 5G మొబైల్‌లో డిస్ప్లే 1604 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్.625 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. MediaTek డైమెన్సిటీ 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఈ మొబైల్‌లో గ్రాఫిక్స్ కోసం, Arm Mali G57 MC2 GPU ఉంది.స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.

ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ,AI సెకండరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం మొబైల్‌లో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు . ఫోన్‌లో 5000mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 15W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందించారు. అయితే, ఈ మొబైల్ భారతదేశంలో 6000mAh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ తీసుకొచ్చారు. కనెక్టివిటీ ఎంపికలో డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.3, GPS, USB టైప్-C మొదలైనవి ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories