ఫ్రీ ఫైర్‌ ఆన్‌లైన్‌ గేమ్‌కు ఇంటర్‌ విద్యార్థి బలి.. పురుగులమందు తాగి...

Free Fire Gamer Rajesh Self Destruction Due to Money Loss in Game in Bhadradri Kothagudem district
x

ఫ్రీ ఫైర్‌ ఆన్‌లైన్‌ గేమ్‌కు ఇంటర్‌ విద్యార్థి బలి.. పురుగులమందు తాగి...

Highlights

Bhadradri Kothagudem: మొబైల్‌లో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ఫ్రీ ఫైర్‌ గేమ్‌ ఆడిన రాజేష్‌...

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అశ్వారావుపేట మండలం పేరాయిగూడెంలో ఇంటర్‌ విద్యార్థి రాజేష్‌.. పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ.. వచ్చిన డబ్బులను రాజేష్‌ అకౌంట్‌లో జమ చేశారు. అయితే.. మొబైల్‌లో ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో ఫ్రీ ఫైర్‌ ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడిన రాజేష్.. డబ్బులు పోగొట్టుకున్నాడు.

విషయం తల్లిదండ్రులకు తెలిస్తే.. మందలిస్తారన్న భయంతో.. పురుగులమందు సేవించాడు. కుటుంబీకులు, స్నేహితులు.. బాధితుడిని అశ్వారావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే.. అప్పటికే రాజేష్‌ పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పడంతో.. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ రాజేష్ మృతి చెందాడు. తమ కుమారుడి మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories