Poco M3 Pro 5G: పోకో నుంచి మొదటి 5జీ ఫోన్.. లీకైన ఫీచర్లు.. త్వరలో లాంఛ్

Poco First 5g Phone M3 Pro;  Launch Very Soon in India
x

పోకో ఎం3 ప్రో (ఫొటో ట్విట్టర్) 

Highlights

Poco M3 Pro 5G: ఇండియాలో పోకో త్వరలో 5జీ ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది.

Poco M3 Pro 5G: ఇండియాలో పోకో త్వరలో 5జీ ఫోన్ లాంచ్ చేయనుందని తెలుస్తోంది. పోకో ఎం3 ప్రో గా పిలిచే ఈ ఫోన్ రెడ్ మీ నోట్ 10 5జీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానుందని సమాచారం.

ఈ ఫోన్ బీఐఎస్ సర్టిఫికేషన్ కూడా పొందింది. ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం.. పోకో ఎం3 ప్రోలో 22W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఎంఐయూఐ 12, బ్లూటూత్ వీ5.1 కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే దీనిలో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + డిస్‌ ప్లే ఉండనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

దీంతో పాటు చైనాలో రెడ్‌మీ 20 ఎక్స్‌గా ఈ ఫోన్ రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా, ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.

అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో విడుదల కానున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇక కెమెరాల విషయనికి వస్తే.. వెనుకాల 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా అందించనున్నారు. దీనితో పాటు 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న రెండు కెమెరాల సెటప్ ఉండనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ గా ఉండనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories