Portable Fan: చూడ్డానికే చిన్నదే.. స్విచ్ఛ్ ఆన్ చేస్తే ఇంటిని సిమ్లాలా మార్చేస్తుంది.. ధర, ఫీచర్లు తెలిస్తే, ఆర్డర్ పెట్టేస్తారంతే..!

Orbit Tower Fan: వేసవి ఎండలు దంచి కొడుతున్నాయి. విపరీతమైన వేడితో జనాలు తట్టుకోలేకపోతున్నారు.

Arun Chilukuri
Updated on: 4 April 2024 4:00 PM IST
Orbit Portable Tower Fan for Multipurpose Oscillating Fan to Cool Home Check Price and Features
X

Portable Fan: చూడ్డానికే చిన్నదే.. స్విచ్ఛ్ ఆన్ చేస్తే ఇంటిని సిమ్లాలా మార్చేస్తుంది.. ధర, ఫీచర్లు తెలిస్తే, ఆర్డర్ పెట్టేస్తారంతే..!

Orbit Tower Fan: వేసవి ఎండలు దంచి కొడుతున్నాయి. విపరీతమైన వేడితో జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఈ మేరకు వేడిని తట్టుకునేందుకు కూలర్లు, ఏసీలు తెచ్చుకుంటున్నారు. అయితే, వీటి వాడకంతో అధిక ఖర్చుతోపాటు విద్యుత్ బిల్లులు కూడా తడిసిమోపడవుతుంటాయి. దీంతో వీటికి ఆల్టర్‌నేట్‌గా మార్కెట్‌లో మినీ ఏసీలు, పోర్టబుల్ కూలర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ఉపయోగించడంతో ఎండల నుంచి ఉపశమనం పొందవచ్చు.ఈ క్రమంలో ఇంటిని చల్లగా ఉండేందుకు పెద్ద ఫ్యాన్ అవసరమని అనుకుంటున్నారా? అయితే, ఓర్బిట్ టవర్ ఫ్యాన్ మీ అవసరాలకు ఖచ్చితంగా సరిపోతుంది. చిన్నదైన డిజైన్‌తో, అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఇది మిమ్మల్ని చల్లగా ఉంచడానికి, స్థలం ఆదా చేయడానికి సహాయపడుతుంది.

ఎక్కడైనా, ఎప్పుడైనా చల్లదనం:

పోర్టబుల్: ఈ ఫ్యాన్‌ను ఇంటిలోని ఏ ప్రదేశంలోనైనా ఉపయోగించవచ్చు. డైనింగ్ టేబుల్‌పై, బెడ్‌ రూమ్‌లోని నైట్‌స్టాండ్‌పై లేదా మీ వర్క్‌స్పేస్‌లోని డెస్క్‌పై ఉంచి, వాడుకోవచ్చు.

3 స్పీడ్‌ కంట్రోల్స్: మీకు కావలసినంత గాలి ప్రవాహాన్ని ఎంచుకోవడానికి 3 స్పీడ్ కంట్రోల్స్ ఉన్నాయి.

ఆసిలేటింగ్ ఫీచర్: గది అంతా చల్లగా ఉండేలా ఆసిలేటింగ్ ఫీచర్ కూడా అందించారు. దీంతో ఇంటి మూలాల్లోకి గాలిని పంపవచ్చు.

ఇంటికి సరిపోయే డిజైన్:

స్థలం ఆదా: ఈ టవర్ ఫ్యాన్ చిన్నదైన, కాంపాక్ట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది మీ ఇంట్లో ఎక్కువ స్థలాన్ని ఆక్రమించకుండా చల్లని గాలిని అందిస్తుంది.

ఆధునిక డిజైన్: ఆకర్షణీయమైన డిజైన్‌తో, ఈ ఫ్యాన్ మీ ఇంటి అలంకరణకు కూడా అనుగుణంగా ఉంటుంది.

ధర: అమెజాన్‌లో ఈ ఓర్బిట్ పోర్టబుల్ టవర్ ఫ్యాన్ అసలు ధర రూ.3000లకు లభిస్తుంది. కానీ, ఆఫర్‌లో భాగంగా 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఆఫర్‌లో భాగంగా రూ. 1509లకు ఇంటికి తెచ్చుకోవచ్చు.

పెద్ద ఫ్యాన్‌లకు బదులుగా, ఓర్బిట్ టవర్ ఫ్యాన్ చిన్నదైన ధర, అధునాతన ఫీచర్లతో మీ ఇంటిని చల్లగా ఉంచడానికి సరైన పరిష్కారం. ఈ వేసవిలో చల్లగా ఉండటానికి ఇదే సరైన పోర్టబుల్ ఫ్యాన్. మరి ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే ఆర్డర్ పెట్టేయండి.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story