Oppo Reno 6: ఒప్పో నుంచి రెండు కొత్త స్మార్ట్‌ ఫోన్‌లు

OPPO Reno 6 series launch in India on July 14... Check price, specs
x

OPPO Reno smart Phone

Highlights

Oppo Reno 6: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లోకి రెండు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తోంది.

Oppo Reno 6: ఎప్పటికప్పుడు ఆకట్టుకునే ఫీచర్లతో కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తోన్న ఒప్పో తాజాగా మరో రెండు స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేసింది. రెనో సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 6, ఒప్పో రెనో 6 ప్రో ఫోన్‌లను మే 27న చైనాలో లాంచ్‌ చేసింది. ఇక ఈ ఫోన్‌లను భారత మార్కెట్లో జులై 14న విడుదలచేయనున్నారు.

5జీ మోడల్స్‌లో వచ్చిన ఒప్పో రెనో 6, రెనో 6 ప్రో ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. ఇక రెనో 6లో 6.43 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్‌ 11.3పై పనిచేస్తాయి. ఒప్పో రెనో 6 ధర రూ. 31,800, ఒప్పో రెనో 6 ప్రో ధర రూ. 39,800గా ఉండనున్నట్లు తెలుస్తోంది. రెనో 6 ప్రోలో 6.55 ఇంచెస్‌ స్క్రీన్‌ను పొందుపరిచారు. ఇక కెమెరా విషయానికొస్తే ఒప్పో ఈ రెండు మోడల్స్‌లో 64 మెగాపిక్సెల్‌ (రెయిర్‌ కెమెరా), 32 మెగాపిక్సెల్ (సెల్ఫీ) కెమెరా అందిస్తున్నారు. స్టోరేజ్‌ విషయానికొస్తే.. 12 జీబీ ర్యామ్‌+256 జీబీ ఇంటర్ననల్‌ స్టోరేజీని అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories