Oppo A16K: అతి తక్కువ ధరకే ఒప్పో A16K సరికొత్త స్మార్ట్ ఫోన్

* ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ సంస్థ ఒప్పో నుండి A- సిరీస్ విభాగంలో ఒప్పో A16K సరికొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది.

Sandeep Reddy
Updated on: 8 Nov 2021 4:45 PM IST
Oppo Launched Oppo A16K New Smart Phone Model With Specifications and Price
X

Oppo A16K : అతి తక్కువ ధరకే ఒప్పో A16K సరికొత్త స్మార్ట్ ఫోన్

Oppo A16K Launched: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ ఫోన్ సంస్థ ఒప్పో నుండి A- సిరీస్ విభాగంలో ఒప్పో A16K సరికొత్త మోడల్ స్మార్ట్ ఫోన్ ని ఫిలిపిన్స్ లో విడుదల చేసింది. ఒప్పో A16K ఫోన్ 13 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు 5-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. ఇక 4,230mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒప్పో A16K స్మార్ట్‌ఫోన్ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే నానో స్లాట్ కలిగి ఉన్న డ్యూయల్ సిమ్ తో పాటు కలర్ OS 11.1 Lite తో ఆండ్రాయిడ్ 11లో ఫోన్ పని చేస్తుంది.

60 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.52 అంగుళాల HD+ IPS LCD డిస్‌ ప్లేను 1600*720 పిక్సెల్‌ తో పాటు 269 ppi కలిగి ఉంది. ఒప్పోకి సంబంధించి ఈ మోడల్ ఫోన్ లో 'ఐ-కేర్' స్క్రీన్ ఫీచర్ కూడా ఉంది. Oppo A16K స్మార్ట్ ఫోన్ 3 GB RAM, 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఆక్టా-కోర్ Mediatek Helio G35 ప్రాసెసర్ ద్వారా పని చేస్తుంది. ఈ మోడల్ లో గల అదనపు మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజ్ ను 256 GB వరకు ఉపయోగించుకోవచ్చు. ఒప్పో A16K మార్కెట్ ధర విషయానికొస్తే 10,300 రూపాయలుగా ఉండే అవకాశం ఉంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story