OnePlus Nord CE 5G: అదిరిపోయే డిజైన్ తో మార్కెట్లోకి

OnePlus Nord CE 5G: స్మార్ట్ ఫోన్ కంపెనీ OnePlus మ‌రో ఫోన్ ను మార్కెట్లొకి లాంచ్ చేయ‌నుంది

Samba Siva Rao
Published on: 3 Jun 2021 11:35 AM IST
OnePlus Nord CE 5G Reveled Before Launch
X

OnePlus Nord CE 5G ( వికీపీడియా)

OnePlus Nord CE 5G: స్మార్ట్ ఫోన్ కంపెనీ OnePlus మ‌రో ఫోన్ ను మార్కెట్లొకి లాంచ్ చేయ‌నుంది. వ‌న్ ప్ల‌స్ Nord CE 5G ను జూన్ 10 న లాంచ్ చేస్తోంది. OnePlus Nord CE 5G లాంచ్ కోసం ఆన్లైన్లో మాత్ర‌మే అందుబాటులో ఉంచాల‌ని ప్ర‌య‌త్నింస్తుంది. ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రత్యేకతలను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది. ఇప్ప‌టికే రెండు ఫీచర్లను ఇప్పటికే రివీల్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇవ్వనున్న 4 మిస్టరీయస్ ఫీచర్లను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తోంది.

ఇక మిగిలిన రెండు మిస్టీరియస్ ఫీచర్లను జూన్ 4 మరియు జూన్ 8 న రివీల్ చేస్తున్నట్లు డేట్స్ ప్రకటించింది. అలాగే, OnePlus Nord CE 5G స్మార్ట్ ఫోన్ ను జూన్ 11 న ప్రీ ఆర్డర్ చేసే వారికి రూ. 2,699 రూపాయల విలువ గల గిఫ్ట్స్ ని కూడా ఇవ్వనున్నట్లు అఫర్ చేస్తోంది. వన్ ప్లస్ అదే రోజు ఒక కొత్త స్మార్ట్ టీవీ ని కూడా విడుదల చేయబోతోంది.

ఇండియాలో ఇప్పటికే OnePlus Nord ని మంచి ఫీచర్లతో తక్కువ ధరలో అందించిన వన్ ప్లస్, ఈ కొత్త OnePlus Nord CE 5G స్మార్ట్ ఫోన్ ను ఎటువంటి ఫీచర్లతో తీసుకువస్తుందో చూడాలి. రివీల్ చేసిన వివరాల ప్రకారం, ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ చాలా సన్నని డిజైన్ తో ఉన్నట్లు చెబుతోంది. అంతేకాదు, కొత్త స్లీక్ మరియు స్ట్రీమ్ లైన్డ్ డిజైన్ తో ఈ ఫోన్ వస్తున్నట్లు వివరించింది.

దీని పీచ‌ర్లు చ‌స్తే..

డిస్ల్పే చూస్తే.. 6.43-inch

ప్రోసెస్సేర్ Qualcomm Snapdragon 750G,

ముందు కెమెరా 16 ఎంపీ

వెన‌క‌వైపు కెమెరా 64 ఎంపీ,

Android 11

ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story