OnePlus 12R Price Drop: అమెజాన్ బంపరాఫర్.. ఈ వన్‌ప్లస్ ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్..!

OnePlus 12R Price Drop
x

OnePlus 12R Price Drop: అమెజాన్ బంపరాఫర్.. ఈ వన్‌ప్లస్ ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్..!

Highlights

OnePlus 12R Price Drop: వన్‌ప్లస్ ఒక ప్రముఖ టెక్ బ్రాండ్. కంపెనీ తన కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి బడ్జెట్‌లో అత్యుత్తమ హ్యాండ్‌సెట్‌లను అందిస్తుంది.

OnePlus 12R Price Drop: వన్‌ప్లస్ ఒక ప్రముఖ టెక్ బ్రాండ్. కంపెనీ తన కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి బడ్జెట్‌లో అత్యుత్తమ హ్యాండ్‌సెట్‌లను అందిస్తుంది. ఇప్పుడు OnePlus 12Rపై ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఫోన్ అత్యంత తగ్గింపుతో అందుబాటులో ఉంది. అంతే కాకుండా ఫోన్‌పై అదనపు ప్రయోజనాలగా బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ కొనాలని చూస్తుంటే ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

OnePlus 12R Offers

ప్రస్తుతం ఈ ఫోన్ అమెజాన్‌లో కేవలం రూ. 32,999కి అందుబాటులో ఉంది. అయితే ఈ హ్యాండ్‌సెట్ జనవరి 2024లో రూ. 42,999కి లాంచ్ చేశారు. అలాగే, మీరు ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌ల ద్వారా ఫోన్‌ను కొంటే రూ. 3000 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. నెలవారీ నో కాస్ట్ ఈఎమ్ఐ‌గా రూ. 1600 చెల్లించి కూడా ఫోన్‌‌ను మీ సొంతం చేసుకోవచ్చు. ఫోన్‌లో ఐరన్ గ్రే, కూల్ బ్లూ, సన్‌సెట్ డ్యూన్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి.

OnePlus 12R Features

ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాసెసర్ మంచి గేమింగ్, మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఫోన్‌లో 1.5K LTPO ProXDR స్క్రీన్, డాల్బీ విజన్ ఉంది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఆక్వా టచ్ ఫీచర్‌ను సపోర్ట్ చేస్తుంది, తద్వారా మీరు ఈ ఫోన్‌ను తడి చేతులతో కూడా స్వైప్ చేయచ్చు.

కెమెరా విషయానికొస్తే.. ఫోన్‌లో 50MP Sony IMX890 మెయిన్ కెమెరా, అల్ట్రా-వైడ్ కెమెరా, అల్ట్రా-క్లియర్ ఇమేజ్ క్వాలిటీ సెన్సార్ ఉన్నాయి, తద్వారా మీరు అద్భుతమైన ఫోటోలు తీయచ్చు. పవర్ కోసం ఫోన్‌లో 5500 mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 100W సూపర్‌వూక్ ఛార్జింగ్‌‌కి సపోర్ట్ చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories