Nokia 2720 V Flip: ఫ్లిప్‌ఫోన్ రిలీజ్ చేసిన నోకియా.. ధర రూ.6వేల లోపే!

Nokia 2720 V Flip: నోకియా 2720 వీ ఫ్లిప్ ఫీచర్ ఫోన్ ను విడుదల చేసింది.

Venkata Chari
Updated on: 15 May 2021 8:01 PM IST
Nokia 2720 V Flip Feature Phone Launches Check Price Specification Features
X

నోకియా ఫ్లిప్ ఫోన్ (ఫొటో ట్విట్టర్)

Nokia 2720 V Flip: విపణిలోకి కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ.. నోకియా దూసుకపోతోంది. తాజాగా నోకియా 2720 వీ ఫ్లిప్ ఫీచర్ ఫోన్ ను విడుదల చేసింది. ఇందులో కైఓఎస్, 4జీ లాంటి ఫీచర్లు విడుదలైన ఈ ఫోన్ ప్రస్తుతం అమెరికాలో మాత్రమే దొరకనుంది. త్వరలో ప్రపంచ వ్యప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

దీని ధరను 79.99 డాలర్లుగా(సుమారు రూ.5,875) ఉంది. మే 20 నుంచి ఈ ఫోన్ సేల్ కు రానుంది. 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. బ్లాక్ కలర్ లో మాత్రమే విడుదలైంది.

ఇందులో 2.8 అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లేను అందించారు. అలాగే 1.3 అంగుళాల సెకండరీ డిస్ ప్లే ను ఫోన్ బయటవైపు అందించారు. 1.1 గిగాహెర్ట్జ్ క్వాల్‌కాం 205 ప్రాసెసర్ తో వచ్చిన ఈ ఫోన్‌లో 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్‌ను అందించారు. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా స్టోరేజ్‌ను 32 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఈ ఫోన్‌లో బ్యాక్‌సైడ్ 2 MP కెమెరాను అందించారు. 1500 ఎంఏహెచ్‌ బ్యాటరీతో పనిచేయనున్న ఈ ఫోన్ లో కైఓఎస్ ఆపరేటింగ్ సిస్టం అందించారు. ఈ ఫోన్‌లో గూగుల్ అసిస్టెంట్‌ను కూడా పొందుపర్చారు. యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి యాప్స్‌ను సపోర్ట్ చేస్తుంది.

Venkata Chari

Venkata Chari

Next Story