Netflix: కొత్త సంవత్సరం నెట్‌ఫ్లిక్స్‌ షాకింగ్‌ నిర్ణయం.. పాస్‌వర్డ్‌ షేరింగ్‌ ఉండదిక..!

Netflix: కొత్త సంవత్సరం నెట్‌ఫ్లిక్స్‌ షాకింగ్‌ నిర్ణయం.. పాస్‌వర్డ్‌ షేరింగ్‌ ఉండదిక..!
x
Highlights

Netflix: కొత్త సంవత్సరం నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు బ్యాడ్‌ న్యూస్‌ అందిస్తోంది.

Netflix: కొత్త సంవత్సరం నెట్‌ఫ్లిక్స్ వినియోగదారులకు బ్యాడ్‌ న్యూస్‌ అందిస్తోంది. ఇక నుంచి మీరు కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి పాస్‌వర్డ్‌లను తీసుకొని ఇష్టమైన నెట్‌ఫ్లిక్స్ షోలను ఆస్వాదించలేరు. కొత్త సంవత్సరం నుంచి నెట్‌ఫ్లిక్స్‌ పాస్‌వర్డ్ షేరింగ్‌ను పూర్తిగా అరికట్టాలని యోచిస్తోంది. చాలా కాలంగా నెట్‌ఫ్లిక్స్ తక్కువ సభ్యత్వాల వెనుక పాస్‌వర్డ్ షేరింగ్‌ ఉందని తెలుసుకుంది. వినియోగదారులను ప్రభావితం చేయకుండా ఈ సమస్యను అధిగమించడానికి కంపెనీ చాలా ఆలోచన చేస్తుంది.

ఈ సంవత్సరం ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్ కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ రీడ్ హేస్టింగ్స్ తన సీనియర్‌లకు పాస్‌వర్డ్ షేరింగ్ సమస్య తక్కువ సభ్యత్వాలకి కారణమని తెలిపారు. నివేదికల ప్రకారం కుటుంబం, స్నేహితుల నుంచి అరువు తెచ్చుకున్న పాస్‌వర్డ్‌లను ఉపయోగించి 100 మిలియన్ల మంది వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్‌లో కంటెంట్‌ను చూస్తున్నారని తేల్చారు. అందుకే 2023 నుంచి నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్‌లను షేర్‌ చేసుకునేవారికి ఛార్జీ విధించడం ప్రారంభిస్తుంది. దీనికి సంబంధించి వచ్చే ఏడాది USలో అప్‌డేట్‌ను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ చర్యతో వినియోగదారుల సంఖ్య మరింత తగ్గిపోయే అవకాశం ఉంది.

వినియోగదారు నిబంధనలు

నెట్‌ఫ్లిక్స్ సేవా నిబంధనల ప్రకారం సబ్‌స్కైబర్ తప్పనిసరిగా తాను ఉపయోగించే పరికరాన్ని నియంత్రించాలి. లాగిన్ ఆధారాలను షేర్‌ చేయకూడదు. అయితే కంపెనీ ఈ షరతులను ఎప్పుడూ కఠినంగా అమలు చేయలేదు. ఈ సంవత్సరం కలిసి జీవించే వ్యక్తులు ఖాతాలను షేర్‌ చేసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. IP చిరునామా, వినియోగదారు ID, ఆధారంగా కంపెనీ నియమాలను వర్తింపజేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories