Moto G71 5G: తక్కువ ధరలో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే?

Moto G71 5G: Motorola బడ్జెట్ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తూ ఆకట్టుకుంటోంది. అందులో భాగంగానే Moto G71 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్‌ ధరల్లో లభించే బెస్ట్ 5జీ మొబైల్‌‌లో మోటరోలా జీ71 ముందుంటుంది.

Arun Chilukuri
Updated on: 26 Jan 2022 1:59 PM IST
motorola g71 best budget 5g smartphone price and specifications check here
X

Moto G71 5G: తక్కువ ధరలో బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే? 

Moto G71 5G: స్మార్ట్‌ఫోన్ మేకర్ మోటరోలా మార్కెట్లో ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తూనే ఉంది. Motorola బడ్జెట్ ధరల్లో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తూ ఆకట్టుకుంటోంది. అందులో భాగంగానే Moto G71 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. బడ్జెట్‌ ధరల్లో లభించే బెస్ట్ 5జీ మొబైల్‌‌లో మోటరోలా జీ71 ముందుంటుంది.

Moto G71 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.40-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. Moto G71 ఆక్టా కోర్ Qualcomm SM6375 స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.

Moto G71 వెనుక భాగంలో, f/1.8 అపెర్చర్‌తో 50 మెగాపిక్సెల్‌ల మెయిన్ కెమెరా, f/2.2 ఎపర్చర్‌తో 8 మెగాపిక్సెల్‌, f/2.4 అపెర్చర్‌తో 2 మెగాపిక్సెల్‌తో మూడు కెమెరాల సెటప్ అందించారు. అలాగే ముందు భాగంలో, f/2.2 ఎపర్చర్‌తో 16-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. Moto G71 5000mAh బ్యాటరీతో పనిచేయనుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. Moto G71 161.20 mm పొడవు, 73.90 mm వెడల్పు, 8.50 mm మందం, 179.00 గ్రాముల బరువు ఉంది. Moto G71 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా ఉంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story