Mobile Recharge: సెకండ్‌ సిమ్‌ ఎప్పుడూ యాక్టివ్‌లో ఉండాలా.? ట్రాయ్‌ శుభవార్త..!

Mobile SIM Active Without Any Active Recharge Plan Check Here for Full Details
x

Mobile Recharge: సెకండ్‌ సిమ్‌ ఎప్పుడూ యాక్టివ్‌లో ఉండాలా.? ట్రాయ్‌ శుభవార్త..!

Highlights

Mobile Recharge: టెలికం యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది.

Mobile Recharge: టెలికం యూజర్లకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రీఛార్జ్‌ ధరలు భారీగా పెరిగిన ప్రస్తుత తరుణంలో సిమ్‌ ఎప్పుడూ యాక్టివ్‌లో ఉండే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రెండు సిమ్‌లు ఉపయోగించే వారికి ఈ నిర్ణయం ఎంతో మేలు చేయనుంది. ఎలాంటి రీఛార్జ్‌ చేయకుండానే సిమ్‌ యాక్టివ్‌లో ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

ట్రాయ్‌ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎయిర్‌టెల్ వినియోగదారులు ఇప్పుడు రీఛార్జ్ చేయకుండా 90 రోజుల పాటు సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఆ తర్వాత కూడా 15 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ను అందిస్తారు. ఈ సమయంలో తప్పనిసరిగా రీఛార్జ్‌ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వ్యవధిలోపు నంబర్‌ రీఛార్జ్‌ చేయకపోతే నంబర్‌ డీయాకటివేట్‌ అవుతంది. అప్పుడు మీ నెంబర్‌ను మరో యూజర్‌కు కేటాయిస్తారు.

జియో సిమ్‌ విషయానికొస్తే వీరు కూడా 90 రోజుల పాటు సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకునే సదుపాయం తీసుకొస్తున్నారు. అయితే ఇన్‌కమింగ్ కాల్ సర్వీస్ మీరు అంతకు ముందు చేసిన రీఛార్జ్‌ ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ 90 రోజుల తర్వాత రీఛార్జ్‌ చేయకపోతే సిమ్‌ పర్మినెంట్‌గా డిస్‌కనెక్ట్‌ అవుతుంది. ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సుదీర్ఘమైన చెల్లుబాటును అందిస్తోంది. ఎలాంటి రీఛార్జ లేకుంఆ 180 రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుంది.

వోడాఫోన్‌ ఐడియా సిమ్‌ యూజర్లకు 90 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ని అందించారు. ఆ తర్వాత సిమ్‌ యాక్టివ్‌గా ఉండాలంటే కనీసం రూ. 49తో రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సిమ్‌ 90 రోజుల కంటే ఎక్కువ యాక్టివ్‌గా ఉండి, ఖాతాలో 20 నుంచి రూ. 30 వరకు బ్యాలెన్స్‌ ఉండాలి. ఈ బ్యాలెన్స్‌ నుంచి నేరుగా అమౌంట్‌ కట్‌ అయ్యి సిమ్‌ యాక్టివ్‌లో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories