Portable Generator: కరెంట్ కోతలతో ఇబ్బందులా.. ఈ పోర్టబుల్ జనరేటర్‌తో చెక్ పెట్టేయండి.. ఎప్పుడైనా, ఎక్కడైనా వాడేయోచ్చు..!

Solar Generator: వర్షకాలం మొదలైంది. దీంతో విద్యుత్ కోతల సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 5 Jun 2024 12:54 PM IST
Mini SARRVAD Portable Solar Power Generator S-150 to Run Your Home Appliances Without Power
X

Portable Generator: కరెంట్ కోతలతో ఇబ్బందులా.. ఈ పోర్టబుల్ జనరేటర్‌తో చెక్ పెట్టేయండి..

Solar Generator: వర్షకాలం మొదలైంది. దీంతో విద్యుత్ కోతల సమస్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఇటువంటి పరిస్థితిలో, మీరు మీ ఇంట్లో చాలా ఉపకరణాలను ఆపరేట్ చేయలేరు. ఇంట్లో ప్రతీ వస్తువు దాదాపుగా కరెంట్‌తోనే పనిచేస్తుంటుంది. వైఫై నుంచి టీవీ వరకు.. మిక్సర్ నుంచి ఫ్యాన్ వరకు ఇలా అన్నీ కరెంట్‌తోనే నడుస్తుంటాయి. కరెంట్ సమస్యలతో సతమతమవుతుంటే.. మీకోసం సోలార్ జనరేటర్‌ని తీసుకువచ్చాం. సోలార్ జనరేటర్లు మార్కెట్‌లో సులువుగా లభిస్తాయి. ఇవి విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సౌర శక్తిని ఉపయోగిస్తాయి. తక్షణ పవర్ బ్యాకప్‌ను అందించే చౌకైన సౌర విద్యుత్ జనరేటర్ గురించి చెప్పబోతున్నాం.

శక్తివంతమైన జనరేటర్‌గా పేరుగాంచిన SARRVAD పోర్టబుల్ సోలార్ పవర్ జనరేటర్ S-150.. ఇది చిన్న బ్యాటరీ పరిమాణంలో ఉంటుంది. మీరు దీన్ని సులభంగా ఎక్కడైనా ఉంచవచ్చు, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. టీవీ, ల్యాప్‌టాప్ వంటి చిన్న పరికరాలను వాడేందుకు దీనిని ఉపయోగించవచ్చు. ఇది చాలా తేలికైన, శక్తివంతమైన పరికరం.

ప్రత్యేకత ఏమిటి..

దీని సామర్థ్యం 42000mAh 155Wh. దీనితో మీరు ఐఫోన్ 8ని సుమారు 8 సార్లు ఛార్జ్ చేయవచ్చు. దీని బరువు 1.89 కిలోలు. ఇది చాలా కాంపాక్ట్‌గా ఉంటుంది. మీరు దీన్ని సోలార్ ప్యానెల్‌తో (14V-22V / 3A గరిష్టంగా) ఛార్జ్ చేయవచ్చు. దీని ధర గురించి మాట్లాడితే, మీరు ఈ సోలార్ పవర్ జెనరేటర్‌ను సరసమైన ధర రూ. 20,000 వద్ద సులభంగా కొనుగోలు చేయవచ్చు.

ఇది చాలా చిన్నది కాబట్టి మీరు దీన్ని మీ బ్యాగ్‌లో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. మీ ల్యాప్‌టాప్, రేడియో, పవర్ బ్యాంక్, స్మార్ట్‌ఫోన్ మొదలైన అన్ని చిన్న పరికరాలను ఛార్జ్ చేయవచ్చు. ఇది అత్యవసర పరిస్థితుల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మీ జేబుపై భారం పడనివ్వదు. ఈ జనరేటర్ ఆరుబయట కూడా బాగా పని చేస్తుంది. పార్టీల సమయంలో మ్యూజిక్ సిస్టమ్‌ని ఎంచక్కా ఉపయోగించవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story