Microsoft Build 2021: మే 25 నుంచి మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2021

Microsoft Build 2021: మైక్రోసాఫ్ట్ తన నూతన ఈవెంట్ "మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2021" తేదీలను ఎట్టకేలకు వెల్లడించింది.

Venkata Chari
Published on: 4 April 2021 6:09 PM IST
Microsoft Build 2021 Dates Confirmed: May 25 to May 27
X

మైక్రోసాప్ట్ (ఫొటో హన్స్ ఇండియా)

Microsoft Build 2021: మైక్రోసాఫ్ట్ తన నూతన ఈవెంట్ "మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2021" తేదీలను ఎట్టకేలకు వెల్లడించింది. ఈ కార్యక్రమం మే 25 నుంచి 27 వరకు జరుగుతుంది. అయితే షెడ్యూల్‌ను మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ ఈవెంట్ డిజిటల్ మాధ్యమంగా జరుగుతుందని తెలుస్తోంది.

ఈమేరకు మైక్రోసాఫ్ట్ ఈవెంట్స్ వెబ్‌సైట్ లో తేదీలను ప్రకటించారు. "మైక్రోసాఫ్ట్ బిల్డ్ అంటే డెవలపర్లు, డిజైనర్లు, స్టార్టప్‌లు, విద్యార్థులు అంతా కలిసి పాల్గొంటారని, నేర్చుకోవడం, కనెక్ట్ అవ్వడం, కోడ్ చేయడంతోపాటు జ్ఞానాన్ని పెంచుకుంటారని సంస్థ పేర్కొంది.

గత ఈవెంట్ లో మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కోసం కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఎడ్జ్ టెంప్లేట్లు, చాట్‌బాట్‌లను సృష్టించేంటువంటి నూతన లక్షణాలను కలిగి ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ తన అజూర్ ఆధారిత సూపర్ కంప్యూటర్‌ను బిల్డ్ 2020 లో ఆవిష్కరించింది. మైక్రోసాఫ్ట్ బిల్డ్ ఈవెంట్‌లు డెవలపర్‌లపై దృష్టి పెడతాయి. విండోస్, ఆఫీస్ తో పాటు ఎడ్జ్ బ్రౌజర్ లాంటి ఉత్పత్తుల కోసం నూతన వర్షన్లను ఇందులో ప్రదర్శిస్తుంది.

Venkata Chari

Venkata Chari

Next Story