హైయ్యెస్ట్ సేఫ్టీ హెలికాప్టర్ ఎలా కూలింది.. అసలు ఈ హెలికాప్టర్ ప్రత్యేకతలు ఏంటి?

Mi-17V-5 Helicopter Specifications
x

హైయ్యెస్ట్ సేఫ్టీ హెలికాప్టర్ ఎలా కూలింది.. అసలు ఈ హెలికాప్టర్ ప్రత్యేకతలు ఏంటి?

Highlights

Mi-17V-5 Helicopter: సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ఎలా కూలింది.? సాంకేతిక లోపం ఏదైనా ఉందా?

Mi-17V-5 Helicopter: సీడీఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ఎలా కూలింది.? సాంకేతిక లోపం ఏదైనా ఉందా? బ్యాడ్ వెదరే కారణమా? లేక పైలెట్ తప్పిదమా? హైయ్యెస్ట్ సేఫ్టీ హెలికాప్టర్ ఎలా కూలింది. ఇప్పుడు ఇదే మాట అందరి నోట వినిపిస్తుంది. అసలు ఈ హెలికాప్టర్ ప్రత్యేకతలు ఏంటి?

ఎంఐ-17వీ5 అత్యుత్తమ రవాణా హెలికాప్టర్లలో ఒకటి. రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖుల ప్రయాణానికీ వాడుతున్నారు. దాదాపు 60 దేశాలు వీటిని వినియోగిస్తున్నాయి. రష్యన్‌ హెలికాప్టర్స్‌కు చెందిన కజాన్‌ సంస్థ ఎంఐ-17వీ5ను తయారు చేస్తోంది. హెలికాప్టర్లలో ఇదే అధునాతనమైంది. వీటి కొనుగోలుకు భారత్‌ 2008లో రష్యాతో ఒప్పందం చేసుకుంది. మొదట 80 హెలికాప్టర్లకు ఆర్డర్లు ఇచ్చింది. తర్వాత వాటిని 151కి పెంచింది. ఇవి లాంఛనంగా 2012లో భారత వాయుసేనలో చేరాయి. ఎత్తయిన పర్వత ప్రాంతాల్లోకి సైనికులు, సరకులను రవాణా చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి.

ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌లో ఆధునిక కాక్‌పిట్‌ ఉంది. పైలట్లకు సమస్త సమాచారాన్ని అందించడానికి 4 మల్టీఫంక్షన్‌ డిస్ప్లేలు, అధునాతన దిక్సూచి వ్యవస్థలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులపై కన్నేసే రాడార్‌. రాత్రివేళ చూసేందుకు నైట్ విజన్‌ సాధనాలు. ఆధునిక కేఎన్‌ఈఐ-8 ఏవియానిక్స్‌ వ్యవస్థ కలిగి ఉంది. పైలట్‌ విశ్రాంతి తీసుకునే సమయంలో ప్రయాణం కోసం పీకేవీ-8 ఆటోపైలట్‌ వ్యవస్థ ఇందులో ఉంది. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేయడం దీని ప్రత్యేకత. ప్రతికూల వాతావరణంలోనూ విహరిస్తుంది. అన్ని హెలికాప్టర్లలా కాకుండా చదునుగా లేని నేలపై రాత్రివేళ కూడా దిగుతుంది.

ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌లో రక్షణ వ్యవస్థలనూ ఏర్పాటు చేశారు. హెలికాప్టర్‌ ఇంజిన్‌ నుంచి వచ్చే వేడి ఆధారంగా వాటిని వేటాడే హీట్‌ సీకింగ్‌ క్షిపణుల దాడిని ఇది తట్టుకుంటుంది. ఫ్యూయల్ ట్యాంక్‌ నుంచి ప్రమాదం సంభవించకుండా పాలీయూరేథీన్‌ అనే సింథటిక్‌ ఫోమ్‌ సేఫ్టీ గా ఉంటుంది. కాక్‌పిట్‌, కీలక వ్యవస్థలను, భాగాలను రక్షించేందుకు కవచాలున్నాయి. ఇందులో ముగ్గురు సిబ్బంది ఉంటారు. గరిష్టంగా 4 వేల 5 వందల కిలోల బరువు మోసే సామర్థ్యం ఉంది. సుమారు 36 మంది సైనికుల్ని చేరవేసే అవకాశం ఉంది. గంటకు 250 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్తుంది. రెండు ఇంజన్లు ఉన్న ఈ హెలికాప్టర్ 6 వేల మీటర్ల ఎత్తు వరకూ వెళ్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories