ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసే వారికి నెలకు రూ. 43 లక్షలు

Instagram Reels Earnings in India
x

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసే వారికి నెలకు రూ. 43 లక్షలు

Highlights

Instagram Reels Earnings: టిక్ టాక్ క్రియేటర్స్‌కు ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ కోసం ప్రత్యేకంగా రీల్స్ చేసే టిక్...

Instagram Reels Earnings: టిక్ టాక్ క్రియేటర్స్‌కు ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీ మెటా బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ కోసం ప్రత్యేకంగా రీల్స్ చేసే టిక్ టాక్ క్రియేటర్స్‌కు నెలకు 2500 డాలర్ల నుండి 50 వేల డాలర్ల వరకు ఇస్తామని మెటా చెప్పినట్లు తెలుస్తోంది. అంటే ఇండియన్ కరెన్సీలో చూస్తే.... నెలకు రూ. 2 లక్షల నుండి 43 లక్షల వరకు వస్తుందన్నమాట. అయితే, ఇది ఇండియాలో ఉండే వారికి కాదండోయ్... ఎందుకంటే అసలు ఇండియాలో టిక్ టాక్ యాప్ అనేదే లేదు.

అమెరికాలో ఉండే టిక్ టాక్ కంటెంట్ క్రియేటర్స్‌కు ఇన్‌స్టాగ్రామ్ ఈ ఆఫర్ ఇచ్చిందని ఇండియా టుడే వార్తా కథనం చెబుతోంది. కనీసం 1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న టిక్ టాక్ కంటెంట్ క్రియేటర్స్‌కు ఈ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 3 నెలల పాటు ఇన్‌స్టాగ్రామ్ కోసం ప్రత్యేకంగా రీల్స్ చేయాల్సిందిగా వారికి మెటా సూచించిందట. వారి రీల్స్‌కు వచ్చే వ్యూస్, లైక్స్, రెస్పాన్స్ రేట్ ఆధారంగా 2500 డాలర్ల నుండి 50 వేల డాలర్ల వరకు ఇచ్చేందుకు మెటా కంపెనీ రెడీ అయింది. కనీసం 3 నెలల పాటు ఈ పని చేయగలిగే వారితోనే మెటా కంపెనీ ఈ అగ్రిమెంట్‌కు సిద్దమైనట్లు సమాచారం.

టిక్ టాక్‌ను దెబ్బ కొట్టేందుకు మెటా భారీ ప్లాన్

చైనాకు చెందిన బైట్ డ్యాన్స్ అనే కంపెనీ తయారు చేసిన టిక్ టాక్ యాప్ కు అమెరికాలో భారీ రెస్పాన్స్ కనిపించింది. అమెరికాలో దాదాపు సగం మంది పౌరులు టిక్ టాక్ యాప్ వాడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే, జో బైడైన్ సర్కార్ దిగిపోయే ముందు ఈ టిక్ టాక్ యాప్‌పై నిషేధం విధించింది.

చైనాకు చెందిన ఈ యాప్‌తో అమెరికా భద్రతకు ముప్పు పొంచి ఉందని బైడెన్ సర్కార్ ఆరోపించింది. ఆ కారణంతోనే యాప్‌పై నిషేధం విధించింది. అయితే, డోనల్డ్ ట్రంప్ సర్కార్ వచ్చాకా ఆ నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తేశారు. టిక్ టాక్ యాప్ బిజినెస్‌లో అమెరికా వాటాలు తీసుకుని ఆ సమస్యకు చెక్ పెట్టనున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు.

ఒకానొక దశలో టెస్లా అధినేత, వరల్డ్ ఫేమస్ బిలియనేర్ ఎలాన్ మస్క్ టిక్ టాక్ యాప్‌ను కొనుగోలు చేస్తారా అనే టాక్ కూడా బలంగా వినిపించింది. ఏదేమైనా అమెరికాలో టిక్ టాక్ యాప్ భవితవ్యం ప్రశ్నార్థంలో పడినట్లే అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.

అయితే, సరిగ్గా ఈ గ్యాప్‌లోనే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు మార్కెట్ పెంచుకుని టిక్ టాక్ యూజర్స్‌ను తమ వైపు తిప్పుకోవాలని మెటా కంపెనీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. అలా చేయాలంటే ముందుగా టిక్ టాక్‌లో రీల్స్ చేసే వారిని ఇ‌న్‌స్టాగ్రామ్ వైపు తిప్పుకోవాలి. ఆ తరువాత టిక్ టాక్ యూజర్స్ కూడా ఆటోమేటిగ్గా ఇన్‌స్టాగ్రామ్ వైపు షిఫ్ట్ అవుతారనేది మెటా ఐడియాగా నెటిజెన్స్ చెప్పుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories