Kawasaki: కొత్త బైక్‌ని విడుదల చేసిన కవాసకి.. అదిరే లుక్.. ధర ఎంతంటే..?

Kawasaki: బైక్‌ ప్రేమికులకు సరికొత్త న్యూస్‌. మార్కెట్‌లోకి కవాసకి కంపెనీ సూపర్‌ బైక్‌ విడుదలైంది.

Arun Chilukuri
Updated on: 6 Feb 2022 10:00 PM IST
Kawasaki has Released the Latest Bike Find out the Price and Features
X

Kawasaki: కొత్త బైక్‌ని విడుదల చేసిన కవాసకి.. అదిరే లుక్.. ధర ఎంతంటే..?

Kawasaki: బైక్‌ ప్రేమికులకు సరికొత్త న్యూస్‌. మార్కెట్‌లోకి కవాసకి కంపెనీ సూపర్‌ బైక్‌ విడుదలైంది. కలల బైక్‌ కోసం ఎదురుచూసే యువతకి ఈ ద్విచక్ర వాహనం బాగా నచ్చుతుంది. ఎందుకంటే కంపెనీ తన 50వ వార్షికోత్సవ సందర్భంగా ఈ బైక్‌ని విడుదల చేసింది. ఇందులో ఫీచర్లు అదిరిపోయాయి. లుక్‌ స్టైలిష్‌గా ఉంది. ఈ బైక్ పేరు కవాసకి Z650 ఇందులో కంపెనీ ప్రత్యేకమైన పెయింట్‌ను ఉపయోగించింది. దీంతో ఈ బైక్‌ రూపం మరింత ఆకర్షణీయంగా ఉంది. చూడగానే అట్రాక్ట్‌ చేస్తుంది.

కవాసకి స్పెషల్ ఎడిషన్ ధర రూ. 6.79 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది స్టాండర్డ్ వెర్షన్ కంటే రూ.5000 ఎక్కువ. కంపెనీ దీన్ని ఆర్డర్ కోసం ఓపెన్ చేసింది. భారతదేశంలో ఎవరైనా సరే ఎక్కడున్నా సరే దీనిని ఆర్డర్ చేయవచ్చు. అయితే మిగతా బైక్‌లతో పోల్చితే దీని ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. దానికి ఒక కారణం ఉంది. ఇందులో ప్రత్యేకమైన పెయింట్‌ని ఉపయోగించారు. ఇది ఫైర్‌క్రాకర్ రెడ్ ఇది 80ల నాటి బైక్‌లలో ఉపయోగించారు. దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది.

స్టాండర్డ్ వెర్షన్ మాదిరిగానే ఈ బైక్‌లో 649 సిసి ఇంజన్ ఇచ్చారు. ఈ ఇంజన్ 8000 rpm వద్ద 67.3 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది 6700 rpm వద్ద 64 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అందించారు. ఈ మోటార్‌సైకిల్‌లో 41 మిమీ టెలిస్కోపిక్ రూపం ఉపయోగించారు. దీనికి 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉండగా ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్ అమర్చారు. రైడింగ్‌ చేస్తే అదిరిపోతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story