OTT Offers: కేవలం రూ. 49 రీఛార్జ్‌తో 4 కంటే ఎక్కువ OTT యాప్‌ల ఆనందం..!

OTT Offers: ఈ రోజుల్లో OTT హవా ఎక్కువగా పెరిగింది. మీరు అపరిమిత OTT ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది శుభవార్తనే చెప్పాలి.

Arun Chilukuri
Updated on: 20 May 2023 6:00 PM IST
Just Rs.49 Recharge More Than 4 OTT Apps Joy
X

OTT Offers: కేవలం రూ. 49 రీఛార్జ్‌తో 4 కంటే ఎక్కువ OTT యాప్‌ల ఆనందం..!

OTT Offers: ఈ రోజుల్లో OTT హవా ఎక్కువగా పెరిగింది. మీరు అపరిమిత OTT ప్లాన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఇది శుభవార్తనే చెప్పాలి. చాలా సార్లు OTT ప్లాట్‌ఫారమ్‌లో సినిమాలు లేదా ఏదైనా సిరీస్‌ని చూడటానికి ఖరీదైన రీఛార్జ్ ప్లాన్‌ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లలో వేర్వేరు చిత్రాలు, సిరీస్‌లు ఉంటాయి. వీటన్నిటిని చూడాలంటే చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది అందరికి సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇప్పుడు వీటన్నిటిని ఒకే రీఛార్జ్ ప్లాన్‌లో ఆస్వాదించవచ్చు. దాని గురించి తెలుసుకుందాం.

వాస్తవానికి ప్రభుత్వ టెలికాం కంపెనీ BSNL మీ కోసం చౌకైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. BSNL సినిమాప్లస్ రీఛార్జ్ ప్లాన్ Lionsgate, Hungama, ShemarooMe, EpicOn వంటి OTTలని అందిస్తుంది. ఇందులో తక్కువ ధరలో అనేక OTT ప్లాన్‌లను పొందుతారు. ఒక్క రీఛార్జ్‌లో పూర్తి వినోదాన్ని పొందుతారు. BSNL సరికొత్త మూడు రీఛార్జ్ ప్లాన్‌ల గురించి ఈరోజు తెలుసుకుందాం.

BSNLరూ.49 ప్లాన్

BSNL రూ.99 ప్లాన్ ప్రస్తుతం రూ.49కి అందుబాటులో ఉంది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో మీరు దాదాపు 7 OTT యాప్‌లను ఆనందిస్తారు. ఈ ప్లాన్‌లో షెమరూ, హంగామా, లయన్స్‌గేట్, EPIC వంటి OTT ప్లాట్‌ఫారమ్‌ల సభ్యత్వాన్ని పొందుతారు.

BSNLరూ.199 ప్లాన్

BSNL సినిమాప్లస్ ప్యాక్‌లో అదిరే ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. BSNL పూర్తి సినిమాప్లస్ ప్యాక్ ధర రూ. 199 మాత్రమే. ఈ ప్లాన్‌లో, మీరు ZEE5 సబ్‌స్క్రిప్షన్, SonyLIV, Hotstar, YuppTV వంటి OTT ప్లాట్‌ఫారమ్‌ల ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు.

BSNLరూ. 249 ప్లాన్

ఈ రీఛార్జ్ ప్లాన్‌లో మీరు ZEE5, SonyLIV, YuppTV, Shemaroo, Hungama, Lionsgate, Hotstar ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు. అంటే ఈ OTT ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న మొత్తం ప్రీమియం కంటెంట్‌ను ఉచితంగా చూడవచ్చు. అయితే BSNL ఈ మూడు ప్లాన్‌ల ప్రయోజనాన్ని పొందడానికి BSNL క్రియాశీల ఫైబర్ కనెక్షన్‌ని కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. ఈ కనెక్షన్ లేకుండా మీరు BSNL సినిమాప్లస్ ప్యాక్ ప్రయోజనాన్ని పొందలేరు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story