Jio Laptop: జియో అత్యంత చౌకైన ల్యాప్‌టాప్‌.. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు..!

Jiobook Laptop at Very Cheapest Price has Amazing Features at Low Price
x

Jio Laptop: జియో అత్యంత చౌకైన ల్యాప్‌టాప్‌.. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు..!

Highlights

Jio Laptop: రిలయన్స్ జియో అత్యంత తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ని విడుదల చేస్తుంది.

Jio Laptop: రిలయన్స్ జియో అత్యంత తక్కువ ధరలో ల్యాప్‌టాప్‌ని విడుదల చేస్తుంది. జూలై 31న అమెజాన్‌లో లాంచ్ కానుంది. ఇది కొత్త వెర్షన్‌ అయి ఉండే అవకాశాలు ఉన్నాయి JioBook 2023 ల్యాప్‌టాప్ బ్లూ కలర్‌లో వస్తుంది. ఇది 4G కనెక్టివిటీ, ఆక్టా-కోర్ ప్రాసెసర్‌కు సపోర్ట్‌ని కలిగి ఉంటుంది. ఇది హై-డెఫినిషన్ వీడియోల స్ట్రీమింగ్, అప్లికేషన్‌ల మధ్య మల్టీ టాస్కింగ్, వివిధ సాఫ్ట్‌వేర్ల పనులని నిర్వహించగలదని కంపెనీ తెలిపింది. తాజా జియో ల్యాప్‌టాప్ డిజైన్ చాలా తేలికగా ఉంటుంది. దీని బరువు దాదాపు 990 గ్రాములు అని తెలిపారు. అమెజాన్ ప్రకారం ఈ ల్యాప్‌టాప్ వినియోగదారులకు ఒక రోజు బ్యాటరీ బ్యాకప్‌ను అందించగలదు. అలాగే జూలై 31న ప్రారంభించే సమయంలో మరిన్ని వివరాలు వెల్లడి చేస్తారు.

అయితే 2022 JioBook బ్రౌజింగ్, స్టడీ, ఇతర విషయాల కోసం రూపొందించారు. ఇది 11.6-అంగుళాల HD డిస్ప్లే, 2GB RAM, 32GB eMMC స్టోరేజ్‌తో వచ్చింది. Qualcomm Snapdragon 665 SoC ద్వారా శక్తిని పొందుతుంది. ఇది Jio OSలో నడుస్తుంది. ఇది కస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ తేలికపాటి పనితీరు కోసం బాగా ఆప్టిమైజ్ చేశారు. జియోబుక్‌ 2022 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల వరకు ఉంటుంది. ఇది వేడెక్కకుండా కూలింగ్‌ సపోర్ట్‌ని కలిగి ఉంటుంది.

ఇది 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ 5.0, HDMI మినీ, Wi-Fi, ఇతర కనెక్టివిటీ ఆప్షన్‌లతో వచ్చింది. ఇది ఎంబెడెడ్ జియో సిమ్ కార్డ్‌తో వస్తుంది. జియో 4జి ఎల్‌టిఇ కనెక్టివిటీని ఎనేబుల్ చేయడానికి ఆప్షన్‌ ఉంది. ఇది భారతదేశంలో రూ.20,000 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఇది కేవలం రిలయన్స్ డిజిటల్ స్టోర్‌ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories