Jio: జియో సూపర్ ప్లాన్‌.. 56 రోజుల వ్యాలిడిటి.. బడ్జెట్‌ ధరలో..!

Jio: టెలికాంరంగంలో జియో దేశంలోనే అతి పెద్ద నెట్‌వర్క్‌గా ఉంది.

Arun Chilukuri
Updated on: 4 Sept 2022 9:01 PM IST
Jio Rs.533 Plan 56 Days Validity Unlimited Calling Internet
X

Jio: జియో సూపర్ ప్లాన్‌.. 56 రోజుల వ్యాలిడిటి.. బడ్జెట్‌ ధరలో..!

Jio: టెలికాంరంగంలో జియో దేశంలోనే అతి పెద్ద నెట్‌వర్క్‌గా ఉంది. యూజర్స్‌ కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్లని ప్రవేశపెడుతుంది. అంతేకాదు మిగతా నెట్‌వర్క్స్‌తో పోలిస్తే ప్లాన్‌లు కూడా చౌకగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఎక్కువ రోజులు వాలిడిటీ కావాలంటే జియో ఫేమస్ ప్లాన్‌ గురించి తెలుసుకోవాల్సిందే. ఇది మీకు చాలా ఇష్టమైనది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

మనం మాట్లాడుతున్న జియో ప్లాన్ ధర రూ.533. ఈ ప్లాన్ 56 రోజుల వ్యాలిడిటితో వస్తుంది. మీరు ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే రెండు నెలల పాటు మళ్లీ రీఛార్జ్ చేసుకోనవసరం లేదు. తరచుగా రీచార్జ్ చేసుకోవడం మరిచిపోయే వాళ్లకి ఇది బెస్ట్‌ ప్లాన్‌ అని చెప్పవచ్చు. ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో కస్టమర్‌లు చాలా సౌకర్యాలను పొందుతారు. అన్నింటిలో మొదటిది ఇందులో 56 రోజుల వ్యాలిడిటి వస్తుంది. అలాగే మొత్తం ప్లాన్‌లో 112 GB డేటా అందిస్తుంది.

ప్రతిరోజు 2GB డేటా వస్తుంది. ఈ ప్లాన్‌లో మీకు 2 నెలల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తారు. ఇది మాత్రమే కాకుండా కస్టమర్‌లు ప్రతిరోజూ 100 smsని ఉపయోగించవచ్చు. ఇది అవసరమైనప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్‌తో జియో టీవీ యాప్, జియో సినిమాతో పాటు జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌తో సహా అనేక ఇతర ప్రయోజనాలు పొందవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story