Jio Hotstar: 60 కోట్ల మంది యూజర్లతో జియో హాట్ స్టార్ రికార్డు.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఓటీటీ

Jio Hotstar: 60 కోట్ల మంది యూజర్లతో జియో హాట్ స్టార్ రికార్డు.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఓటీటీ
x
Highlights

Jio Hotstar: సినిమా థియేటర్లు, టీవీల నుండి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల వైపు ప్రపంచం అడుగులు వేస్తున్న సమయంలో రిలయన్స్, వాల్ట్ డిస్నీ భాగస్వామ్యంతో వచ్చిన జియో హాట్‌స్టార్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌గా నిలిచింది.

Jio Hotstar: సినిమా థియేటర్లు, టీవీల నుండి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల వైపు ప్రపంచం అడుగులు వేస్తున్న సమయంలో రిలయన్స్, వాల్ట్ డిస్నీ భాగస్వామ్యంతో వచ్చిన జియో హాట్‌స్టార్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌గా నిలిచింది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ ఈ విషయాన్ని రిలయన్స్ జియో వార్షిక సాధారణ సమావేశంలో వెల్లడించారు. జియో హాట్‌స్టార్ ప్రస్తుతం మొత్తం టీవీ మార్కెట్‌లో 34% వాటాను కలిగి ఉంది. దీనితో పాటు, మొబైల్, ల్యాప్‌టాప్, టీవీ మరియు ఇతర కనెక్షన్‌ల ద్వారా వందల కోట్ల మందికి కంటెంట్‌ను అందిస్తోంది. జియో హాట్‌స్టార్ వద్ద ప్రస్తుతం 3.20 లక్షల గంటలకు పైగా కంటెంట్ అందుబాటులో ఉంది. ఇది జియో తర్వాతి స్థానంలో ఉన్న రెండు ఓటీటీల కంటెంట్‌ను కలిపినా అంత ఉండదు. ప్రతి సంవత్సరం 30 వేల గంటలకు పైగా కొత్త కంటెంట్‌ను జియో హాట్‌స్టార్ జోడిస్తోంది. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌లను కలుపుకొని జియో హాట్‌స్టార్‌కు మొత్తం 60 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇందులో 30 కోట్ల మంది పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు.

జియో హాట్‌స్టార్‌తో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన క్షణమని ఆకాష్ అంబానీ అన్నారు. కంటెంట్, సాఫ్ట్‌వేర్, ఏఐ (కృత్రిమ మేధస్సు) కలయికతో తాము గొప్ప విషయాలను సాధించామని, భవిష్యత్తులో ఓటీటీని మరిన్ని దేశాలకు విస్తరించేందుకు ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ మొదటి స్థానంలో ఉండగా, జియో హాట్‌స్టార్ రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో అమెజాన్ ఉంది.

కంటెంట్, క్రీడలు

జియో హాట్‌స్టార్ హాలీవుడ్ సినిమాలు, యానిమేషన్ సినిమాలు, డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్‌లతో పాటు భారతీయ భాషలైన హిందీ, కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, మరికొన్ని భాషల సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రదర్శిస్తుంది. దీనితో పాటు ఐపీఎల్ సహా క్రికెట్, ఇతర క్రీడలను ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుంది. క్రికెట్ ప్రసారాల కారణంగా కోట్లాది మంది వీక్షకులు జియో హాట్‌స్టార్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories