Jio: జియో మరో సూపర్ ప్లాన్.. 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభం..!

Jio: జియో మరో సూపర్ ప్లాన్.. 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభం..!

Rama Rao
Updated on: 11 Sept 2022 9:01 PM IST
Jio has introduced an annual plan of Rs 2,999 on the occasion of its 6th anniversary
X

Jio: జియో మరో సూపర్ ప్లాన్.. 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభం..!

Jio: టెలికాం రంగంలో జియో ఒక సంచలనం. యూజర్లకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లని ప్రకటిస్తుంటుంది. తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్‌ అందించడానికి ప్రయత్నిస్తుంది. తాజాగా జియో మరో కొత్త రీచార్జ్‌ ప్లాన్‌తో యూజర్ల ముందుకొచ్చింది. జియో సేవలు ప్రారంభమై ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 6వ వార్షికోత్సవం సందర్భంగా జియో రూ.2,999 ఇయర్లీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీంతో వినియోగదారులకు 6 ప్రయోజనాలు లభించనున్నాయి.

ఈ వార్షిక ప్యాక్‌లో యూజర్లకు అదనంగా 75 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఇక్సిగో కూపన్‌ ద్వారా రూ.4500 అంతకంటే కొనుగోలుపై రూ.750 తగ్గింపు పొందొచ్చు. అలాగే మ్యూజిక్‌ లవర్స్‌ కోసం జియో సావన్‌ ప్రో సేవల 6 నెలల ప్యాక్‌పై 50 శాతం తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా రిలయన్స్ డిజిటల్‌లో రూ.5,000 కొనుగోలుపై రూ.500 విలువైన తగ్గింపు పొందొచ్చు. ఇక నెట్‌మెడ్స్ కూపన్‌ల ద్వారా ఆన్‌లైన్‌ ఫార్మీసీలో కనీసం రూ.750 తగ్గింపు పొందొచ్చు.

ఇంకా ఏజియో కూపన్‌ ద్వారా రూ. 2,990 అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసిన వారికి రూ. 750 డిస్కౌంట్‌ లభిస్తుంది. వీటితో పాటు ఈ ప్యాక్‌తో 365 రోజుల పాటు రోజుకు 2.5 జీబీ డేటాను పొందొచ్చు. అలాగే అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందొచ్చు. ఇంకా హాట్‌స్టార్‌, జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యురిటీ, జియో క్లౌడ్‌ వంటి సేవలను కూడా పొందొచ్చు.

అలాగే రిలయన్స్ జియో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో యూజర్లని కలిగి ఉంది. తాజాగా 5జీ కనెక్షన్‌ను ప్రకటించింది. అంతేకాదు 5G కనెక్షన్ల కోసం అధిక టారిఫ్‌లను వసూలు చేయకూడదని నిర్ణయించుకుంది. దీపావళి సందర్భంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతాలోని అనేక ప్రాంతాల్లో 5G సేవను ప్రారంభించనున్నట్లు జియో తెలిపింది.

Rama Rao

Rama Rao

Next Story