Itel A27: ఆరువేల కంటే తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్.. సూపర్‌ ఫీచర్లు..?

Itel A27: ఆరువేల కంటే తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్.. సూపర్‌ ఫీచర్లు..?
x

Itel A27: ఆరువేల కంటే తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్.. సూపర్‌ ఫీచర్లు..?

Highlights

Itel A27: ఆరువేల కంటే తక్కువ ధరలో స్మార్ట్‌ఫోన్.. సూపర్‌ ఫీచర్లు..?

Itel A27: స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో తన గుర్తింపును కొనసాగించడానికి ఐటెల్‌ కంపెనీ అద్భుతమైన ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌కి Itel A27 అని పేరు పెట్టారు. itel నుంచి వచ్చిన ఈ ఫోన్ AI పవర్ కెమెరాతో 4000mAh శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది. ఫోన్‌లో డ్యూయల్-రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫోన్ వెనుక ప్యానెల్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. ఈ ఫోన్ అన్ని స్పెసిఫికేషన్లు, ధర గురించి తెలుసుకుందాం.

Itel A27 ధర రూ.6,999గా పేర్కొన్నారు. ఇందులో 2 GB RAM + 32 GB స్టోరేజ్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఫోన్ క్రిస్టల్ బ్లూ, సిల్వర్ పర్పుల్, డీప్ గ్రే అనే మూడు రంగుల్లో వస్తుంది. itel A27 గొప్ప ఆఫర్‌తో వస్తుంది. వినియోగదారులు 100 రోజుల్లోపు పూర్తిగా ఉచిత వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను పొందుతారు.

itel A27 స్పెసిఫికేషన్‌లు

itel A27 Android 10 (Go Edition) పై రన్ అవుతుంది. 6.45-అంగుళాల FW IPSడిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1.4GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. దీంతో 2 GBRAM ఇచ్చారు. ఫోన్ స్టోరేజ్ 32 GB. ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్ ఫంక్షన్ కూడా ఉంటుంది. itel A27లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఫోన్ వెనుక భాగంలో 5 మెగాపిక్సెల్ AI కెమెరా ఇచ్చారు. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫోన్ 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

ఇది 20 గంటల వరకు టాక్ టైమ్ అందిస్తుంది. ఫోన్‌లో అన్‌లాక్ చేయడానికి వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో AI బ్యూటీ మోడ్, పోర్ట్రెయిట్ మోడ్, HDR, షార్ట్ వీడియో ఫార్మాట్, AR ఫిల్టర్‌లు, స్టిక్కర్‌లు వంటి వివిధ కెమెరా మోడ్‌లు ఉన్నాయి. ఇది డ్యూయల్ 4G VoLTE ఫంక్షనాలిటీని కూడా సపోర్ట్ చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories