ISRO: మరో ప్రయోగానికి ఇస్రో రెడీ..

ISRO: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది.

Arun Chilukuri
Updated on: 5 Aug 2022 6:30 PM IST
ISRO to launch SSLV-D1/EOS-02 Mission on Sunday
X

ISRO: మరో ప్రయోగానికి ఇస్రో రెడీ..

ISRO: భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈనెల 7న చిన్న ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించడానికి సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఇస్రోకు చెందిన దేశంలోని వివిధ కేంద్రాల నుంచి తీసుకువచ్చిన విడి భాగాలను షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక వద్దకు చేర్చారు. వాహక నౌకను మూడు దశల్లో అనుసంధానం చేశారు. E.O.S-02 ఆజాదీ శాట్ ఉప గ్రహాలను రెడీ చేశారు. ఈ వాహక నౌకలో పూర్తిగా ఘన ఇంధనం ఉంటుంది. మూడు సాలిడ్ మోటార్లు కలిగి ఉన్నాయి. ఇవాళ రాకెట్ సన్నద్ధత, లాంచ్ ఆథరైజేషన్ బోర్డులు కౌంట్‌డౌన్ డేట్‎ను ప్రకటించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story