Smartphone: మీ స్మార్ట్‌ఫోన్ స్లోగా ఉందా.. అయితే ఇలా చేయండి..!

Smartphone: మీ స్మార్ట్‌ఫోన్ స్లోగా ఉందా.. అయితే ఇలా చేయండి..!
Smartphone: ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే ఇంట్లో నుంచి కాలు కూడా బయటపెట్టరు.
Smartphone: ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్ లేనిదే ఇంట్లో నుంచి కాలు కూడా బయటపెట్టరు. ఎవ్వరిని చూసినా సెల్‌ఫోన్‌లో ఏదో ఒకటి చూస్తూ బిజీగా ఉంటారు. కాలం అలా మారిపోయింది. పలు పరిశోధనల్లో యువత గంటకు 10 సార్లు సెల్ ఫోన్ చూస్తారని తేలింది. ఇక దేశంలో 1.2 బిలియన్ మంది మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అయితే నిరంతరం సెల్‌ఫోన్ ఉపయోగించడం వల్ల అది ఒక్కోసారి స్లో అయిపోతుంది. అంతేకాదు హ్యాంగ్ అవుతుంది కూడా అలాంటప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం.
వాస్తవానికి స్మార్ట్ ఫోన్ స్లో కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫోన్‌లలో అడ్డగోలుగా ఫోటోలు, వీడియోలు లోడ్ చేస్తుండటం వల్ల కూడా వేగం తగ్గిపోతుంది. అంతేకాదు రకరకాల యాప్స్ వేసుకోవడం వల్ల స్టోరేజీ నిండిపోయి ఫోన్ నెమ్మదిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌ను వేగంగా, స్మూత్‌గా మార్చడం మీ చేతిలోనే ఉంది. స్మార్ట్‌ఫోన్‌లోని కొన్ని సెట్టింగ్స్ మారిస్తే మీ ఫోన్ వేగంగా పనిచేస్తుంది. అవేంటో చూద్దాం.
1. ముందుగా సెట్టింగ్స్ ఓపెన్ చేసి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయిందో లేదో చూడండి. లేకపోతే అప్‌డేట్ చేయండి. స్మార్ట్ ఫోన్‌లో యాప్స్ వేగంగా పనిచేయాలంటే వాటిని నిరంతరం అప్‌డెట్ చేస్తూ ఉండాలి. దీనికి గూగుల్ ప్లే స్టోర్ వెళ్ళీ ఏవైనా అప్‌డేట్ చేయాల్సి ఉందేమో చూడండి.
2. స్మార్ట్‌ఫోన్‌లో యానిమేషన్స్ ఉంటే స్లోగా ఆపరేట్ అవుతుంది. పాత స్మార్ట్‌ఫోన్స్‌లో యానిమేషన్స్ సరిగ్గా పనిచేయవు. అందుకే సెట్టింగ్స్ ఓపెన్ చేసి About పైన క్లిక్ చేయండి. Build number పైన ఏడు సార్లు ట్యాప్ చేయండి. డెవలపర్ మోడ్ ఎనేబుల్ అవుతుంది. ఆ తర్వాత సెట్టింగ్స్‌లో, సిస్టమ్స్‌లో డెవలపర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి. కిందకు స్క్రోల్ చేస్తే యానిమేషన్స్ కనిపిస్తాయి. యానిమేషన్స్ మొత్తం ఆఫ్ చేయండి.
3. అలాగే స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లో స్టోరేజ్ పైన క్లిక్ చేయండి. Manage Storage పైన క్లిక్ చేయండి. అవసరం లేని ఫైల్స్, యాప్స్ డిలిట్ చేయండి. ముఖ్యమైన ఫైల్స్ ఎక్కువగా ఉంటే మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లోకి బ్యాకప్ చేసుకోండి.
నిడదవోలు వైసీపీ ప్లీనరీ సమావేశంలో నోరుజారిన తానేటి వనిత
28 Jun 2022 7:36 AM GMTబొమ్ములూరులో ఎన్టీఆర్ విగ్రహానికి వైసీపీ రంగులు
27 Jun 2022 4:00 PM GMTబాలినేని హాట్ కామెంట్స్.. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. సొంత పార్టీ నేతలే..
27 Jun 2022 1:39 PM GMTటీ హబ్-2 ప్రారంభానికి సిద్ధం.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేటర్
27 Jun 2022 1:31 PM GMTరైతుబంధు పంపిణీ రేపటి నుంచే.. మొదటిసారి అర్హులైన వారికి అలెర్ట్.. అలా చేస్తేనే..
27 Jun 2022 1:15 PM GMTజూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులను గుర్తించిన బాధితురాలు
27 Jun 2022 1:00 PM GMTవ్యవసాయ బావిలో పడిన ఏనుగు.. ఐదు గంటల పాటు శ్రమించిన అటవీ అధికారులు
27 Jun 2022 12:15 PM GMT
12 కేజీల గోల్డ్ కాయిన్ ఎక్కడుంది.. 40ఏళ్ల మిస్టరీ వీడే టైమ్...
28 Jun 2022 4:00 PM GMTకృష్ణవంశీ సినిమా కోసం కవిత్వాలు చెప్పనున్న మెగాస్టార్
28 Jun 2022 3:45 PM GMTమరో చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ
28 Jun 2022 3:30 PM GMTనుపుర్ శర్మ ఫోటోను స్టేటస్ పెట్టుకున్నందుకు మర్డర్
28 Jun 2022 3:15 PM GMTNaga Chaitanya: ఇకపై కూడా అలానే ఉండబోతున్న అక్కినేని హీరో
28 Jun 2022 3:00 PM GMT