Internet Boosting: వైఫై స్లోగా నడుస్తుందా.. ఈ చిన్న సెట్టింగ్‌ చేస్తే వేగం పెరుగుతుంది..!

Is Wifi Running Slow Doing This Small Setting Will Increase the Speed
x

Internet Boosting: వైఫై స్లోగా నడుస్తుందా.. ఈ చిన్న సెట్టింగ్‌ చేస్తే వేగం పెరుగుతుంది..!

Highlights

Internet Boosting: నేటి కాలంలో వైఫైని కొనుగోలు చేయడం దాన్ని ఇన్‌స్టాల్ చేయడం, ఉపయోగించడం కొంచెం ఖరీదైన పని.

Internet Boosting: నేటి కాలంలో వైఫైని కొనుగోలు చేయడం దాన్ని ఇన్‌స్టాల్ చేయడం, ఉపయోగించడం కొంచెం ఖరీదైన పని. మీరు WiFi కనెక్షన్ తీసుకుంటే దీని కోసం రూ.2000 నుంచి రూ. 4000 వరకు ఖర్చవుతుంది. తర్వాత మీరు ఒక ప్లాన్‌ని ఎంచుకోవాలి ఆ ప్లాన్‌ని ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవాలి. అప్పుడే మీ ఇంట్లో ఇంటర్నెట్ నడుస్తుంది. అయితే నెలలో కొన్ని రోజులలో ఇంటర్నెట్ చాలా నెమ్మదిగా నడుస్తుంది. సాధారణ వీడియోలను కూడా చూడలేరు. ఇలా జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. మీరు ఆఫీసు పని చేస్తుంటే సమస్య మరింత పెరుగుతుంది.

wifi స్థానాన్ని మార్చండి

వాస్తవానికి WiFi నుంచి మంచి ఇంటర్నెట్ స్పీడ్ పొందడానికి WiFi రూటర్ స్థానం సరిగ్గా ఉండటం అవసరం. దీనిని చెడ్డ ప్రదేశంలో ఇన్‌స్టాల్ చేసి ఉంటే ఇంటర్నెట్ వేగం నెమ్మదవుతుంది. మీరు బెస్ట్ లొకేషన్ గురించి మాట్లాడితే ఇంటి మధ్య ప్రాంతం చాలా ఓపెన్‌గా ఉంటుంది. అక్కడ వైఫై రూటర్‌ని కొంచెం ఎత్తులో ఉంచితే ఇంటి మొత్తం మంచి ఇంటర్నెట్ కవరేజీని పొందుతారు. ఈ విధంగా ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు.

ఆప్టిమైజేషన్ ముఖ్యం

అనేక వైఫై సేవలను అందించే కంపెనీలు తమ వైఫై కనెక్షన్‌తో పాటు యాప్‌లను కూడా అందిస్తున్నాయి. WiFi కనెక్షన్ నెమ్మదిగా నడుస్తున్నట్లయితే యాప్‌ని ఉపయోగించడం వల్ల ఇంటర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. ఎయిర్‌టెల్‌ తన ఫైబర్ సర్వీస్‌లో ఆప్టిమైజేషన్ ఆప్షన్ ఉంటుంది. దీనిని ఉపయోగించడం వల్ల WiFi రూటర్ ఇంటర్నెట్ స్పీడ్‌ను చాలా వరకు పెంచుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories