iQOO Z10 Launch: మొబైల్ లవర్స్‌కు కిక్కించే న్యూస్.. ఐక్యూ నుంచి బడ్జెట్ ఫోన్.. ధర ఎంతంటే..?

iQOO Z10 Smartphone to Launch in India on April 11
x

iQOO Z10 Launch: మొబైల్ లవర్స్‌కు కిక్కించే న్యూస్.. ఐక్యూ నుంచి బడ్జెట్ ఫోన్.. ధర ఎంతంటే..?

Highlights

iQOO Z10 Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ దాని కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు iQOO Z10, Z10xలను వచ్చే వారం అంటే ఏప్రిల్ 11న భారతీయ మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది.

iQOO Z10 Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ దాని కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లు iQOO Z10, Z10xలను వచ్చే వారం అంటే ఏప్రిల్ 11న భారతీయ మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఐక్యూ జెడ్10 ప్రధాన దృష్టి దాని భారీ 7,300mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌ను కేవలం 33 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది.

ఇందులో భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ మొబైల్ డిజైన్ కూడా స్లిమ్, చాలా తేలికగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ పరిమాణం స్లిమ్‌గా ఉంటుంది, కేవలం 7.9 మిమీ మందంతో, పట్టుకోవడం సౌకర్యంగా ఉంటుంది. అలాగే ఐక్యూ Z10లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్‌ ఉంటుందని iQOO ధృవీకరించింది. ఇది 4nm ప్రాసెసర్. ఐక్యూ Z10 గేమింగ్ సమయంలో వినియోగదారులకు సున్నితమైన పనితీరును అందిస్తుంది.

iQOO Z10 Features

ఐక్యూ Z10 ఫోన్‌లో 5,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో క్వాడ్-కర్వ్డ్ అమోలెడ్ ప్యానెల్‌ ఉంటుంది. అంటే పీక్ బ్రైట్నెస్ అందించే డిస్‌ప్లేలలో ఇది కూడా ఒకటి. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ని కలిగి ఉండే అవకాశం ఉంది, ఇది స్క్రోలింగ్, గేమింగ్ కోసం సున్నితమైన అనుభవాన్ని అందిస్తుంది.

ఐక్యూ టీజర్ ప్రకారం.. మొబైల్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్-కెమెరా సెటప్‌ ఉంటుంది. కెమెరా సిస్టమ్ అల్ట్రా-వైడ్, మాక్రో షాట్‌ల కోసం అదనపు లెన్స్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. ముందు భాగంలో, 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అధిక క్వాలిటీ సెల్ఫీ పోర్ట్రెయిట్‌, వీడియో కాల్‌లను క్యాప్చర్ చేయడానికి రూపొందించారు.

ఈ మొబైల్ ఫన్‌టచ్ OS 15లో రన్ అవుతుంది, ఇది Android 15పై ఆధారపడి ఉంటుంది. ఇందులో అల్ట్రా గేమ్ మోడ్‌ను కూడా ఉంటుంది, ఇది టచ్ యాక్సిలరేషన్, ఫ్రేమ్ రేట్ బూస్టింగ్ వంటి ఫీచర్‌లతో గేమింగ్ అనుభవాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5G కనెక్టివిటీ ఉండే అవకాశం ఉంది. ఇది మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో గొప్ప ప్యాకేజీగా మారుతుంది.

iQOO Z10 Price

iQOO Z10 ధర ఒక ముఖ్యమైన అంశం. 8GB + 128GB వేరియంట్‌‌ను రూ.21,999 ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫర్‌లతో దీని ధర రూ.19,999కి తగ్గవచ్చు. Z10 అమెజాన్ ఇండియాలో అందుబాటులో ఉంటుందని iQOO ధృవీకరించింది.లాంచ్ ఈవెంట్ తర్వాత ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories