iQOO Neo 10R: ఐక్యూ కొత్త ఫోన్.. మార్చి 10న లాంచ్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..?

iQOO Neo 10R is set to Launch next month, on March 10. Phone features leaked
x

iQOO Neo 10R: ఐక్యూ కొత్త ఫోన్.. మార్చి 10న లాంచ్.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..?

Highlights

iQOO Neo 10R: ఐక్యూ నియో 10ఆర్ వచ్చే నెల అంటే మార్చి 10న లాంచ్ కానుంది. ఇటీవల ఐక్యూ ఇండియా CEO నిపున్ మారియా X లో దీనిని ధృవీకరించారు.

iQOO Neo 10R: ఐక్యూ నియో 10ఆర్ వచ్చే నెల అంటే మార్చి 10న లాంచ్ కానుంది. ఇటీవల ఐక్యూ ఇండియా CEO నిపున్ మారియా X లో దీనిని ధృవీకరించారు. ఇప్పుడు లాంచ్‌కు ముందు ఫోన్ ధర ఆన్‌లైన్‌లో వెల్లడైంది. హార్డ్‌వేర్ పరంగా.. నియో 10R స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్‌తో ఉండవచ్చని iQOO ఇప్పటికే వెల్లడించింది. ఇదే చిప్‌సెట్ Realme GT 6, Xiaomi 14 Civi, Poco F6 వంటి ఫోన్స్‌లో ఉపయోగించారు. కొత్త ఐక్యూ ఫోన్ ధర, ఫీచర్స్ తదితర వివరాలు తెలుసుకుందాం.

ఐక్యూ నియో 10ఆర్ 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 35,999గా ఉండవచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆఫర్లు, డిస్కౌంట్ల తర్వాత ఫోన్‌‌ను రూ.30 వేల లోపు కొనుగోలు చేయచ్చు.

నియో 10ఆర్ ప్రత్యేకమైన కలర్ ర్యాగింగ్ బ్లూలో వస్తుందని కంపెనీ ప్రకటించింది. కంపెనీ షేర్ చేసిన టీజర్‌లు ఫోన్ డిజైన్‌ను చూపుతాయి. ఈ డిజైన్ సిగ్నేచర్ నియో సిరీస్ రూపాన్ని ప్రతిబింబిస్తుంది. వెనుక ప్యానెల్ ఎడమ వైపున గ్రే కలర్ స్ట్రిప్‌తో డ్యూయల్-టోన్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్-కెమెరా సెటప్‌‌తో స్క్వాల్-సైజ్ కెమెరా మాడ్యూల్‌ ఉంది. ఇందులో OISతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్‌ ఉండవచ్చని లీక్‌లు సూచిస్తున్నాయి.

ఐక్యూ నియో 10ఆర్‌లో 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో 1.5K OLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. బ్యాటరీ లైఫ్ కూడా చాలా బలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఫోన్‌లో 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే పెద్ద 6,400mAh బ్యాటరీ ఉంటుంది. నియో 10ఆర్ అమెజాన్ ఇండియా, ఐక్యూ వెబ్‌సైట్ ద్వారా సేల్‌కి వస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories