iQOO 15R: షూట్ చేయండి.. ఆడుకోండి.. 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో iQOO 15R ఎంట్రీ..!

iQOO 15R: షూట్ చేయండి.. ఆడుకోండి.. 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో iQOO 15R ఎంట్రీ..!
x

iQOO 15R: షూట్ చేయండి.. ఆడుకోండి.. 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో iQOO 15R ఎంట్రీ..!

Highlights

iQOO 15R: టెక్ ప్రపంచంలో iQOO హవా కొనసాగుతోంది. ఇటీవలే ఫ్లాగ్‌షిప్ iQOO 15తో మార్కెట్లోకి సంచలనం సృష్టించిన ఈ సంస్థ, ఇప్పుడు తన తదుపరి అస్త్రాన్ని సిద్ధం చేసింది.

iQOO 15R: టెక్ ప్రపంచంలో iQOO హవా కొనసాగుతోంది. ఇటీవలే ఫ్లాగ్‌షిప్ iQOO 15తో మార్కెట్లోకి సంచలనం సృష్టించిన ఈ సంస్థ, ఇప్పుడు తన తదుపరి అస్త్రాన్ని సిద్ధం చేసింది. సరికొత్త ఫీచర్లు, అదిరిపోయే డిజైన్‌తో ‘iQOO 15R’ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెడుతోంది. ఈ మేరకు కంపెనీ ఇండియా సీఈఓ నిపున్ మార్య సోషల్ మీడియా వేదికగా టీజర్‌ను పంచుకుంటూ ఫిబ్రవరి చివరి వారంలో ఈ ఫోన్ లాంచ్ కానుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అమెజాన్‌లో ఈ ఫోన్‌కు సంబంధించిన మైక్రోపేజీ ప్రత్యక్షం కావడంతో టెక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఫిబ్రవరి 24, 2026న గ్రాండ్‌గా లాంచ్ కానున్న ఈ హ్యాండ్‌సెట్ డిజైన్‌ను కంపెనీ ఇప్పటికే రివీల్ చేసింది. ముఖ్యంగా వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ ప్రీమియం లుక్‌ను అందిస్తోంది. యువతను, ముఖ్యంగా గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా దీని రూపురేఖలను తీర్చిదిద్దారు. స్పెసిఫికేషన్ల విషయంలో కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, నెట్టింట వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ ఫోన్ సెగ్మెంట్లోనే అత్యుత్తమ ఫీచర్లతో రాబోతున్నట్లు తెలుస్తోంది.

డిస్‌ప్లే విషయానికి వస్తే, ఇందులో 6.59-అంగుళాల 1.5K LTPS OLED స్క్రీన్‌ను అమర్చే అవకాశం ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 1,800 nits గరిష్ట బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుందని సమాచారం. ఇక పెర్ఫార్మెన్స్ పరంగా రాజీ పడకుండా అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 చిప్‌సెట్‌ను ఇందులో వాడనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు మెరుగైన గేమింగ్ అనుభవం కోసం ప్రత్యేకంగా Q2 గేమింగ్ చిప్‌తో పాటు LPDDR5X అల్ట్రా RAM, UFS 4.1 స్టోరేజ్ సాంకేతికతను జోడించనున్నారు.

బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఏకంగా 7,600mAh భారీ బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం ఉండవచ్చని అంచనా. దుమ్ము, నీటి నుండి రక్షణ కల్పించేలా దీనికి IP68, IP69 రేటింగ్‌లను కూడా అందించనున్నారు. కెమెరా విభాగంలో 200MP ప్రధాన సెన్సార్‌తో పాటు 8MP సెకండరీ కెమెరా ఉండనుందని, సెల్ఫీల కోసం 32MP కెమెరాను పొందుపరిచారని టెక్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ధర విషయానికొస్తే iQOO 15R భారత మార్కెట్లో సుమారు రూ.45,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే కంపెనీ అధికారికంగా వెల్లడించే ధరలు, ఆఫర్ల వివరాల కోసం ఫిబ్రవరి 24 వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే అమెజాన్ టీజర్ల ద్వారా ఈ ఫోన్ హైప్ రోజురోజుకూ పెరుగుతోంది. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు, మధ్యస్థ ధరతో వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఏ మేరకు పోటీనిస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories