IPhone SE 2022: విడుదలకు ముందే లీకైన ఐఫోన్ SE 2022 ఫీచర్లు.. భారీ మార్పులకు సిద్ధమైన ఆపిల్

IPhone SE 2022 Feature Leaked in Online Released in 2022 September | Technology News
x

IPhone SE 2022: విడుదలకు ముందే లీకైన ఐఫోన్ SE 2022 ఫీచర్లు.. భారీ మార్పులకు సిద్ధమైన ఆపిల్

Highlights

IPhone SE 2022: ఆపిల్ తన 3వ తరం ఐఫోన్ SE 5g మోడల్‌ను ఈ సంవత్సరం విడుదల చేయాలని యోచిస్తోంది...

IPhone SE 2022: ఆపిల్ తన 3వ తరం ఐఫోన్ SE 5g మోడల్‌ను ఈ సంవత్సరం విడుదల చేయాలని యోచిస్తోంది. ఫోన్ లాంచ్ చేయడానికి ముందు, ఫీచర్లు, స్పెసిఫికేషన్లకు సంబంధించి అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 8 మాదిరిగానే హ్యాండ్‌సెట్ డిజైన్‌తో వస్తుందని కొత్త నివేదికలు వెలువడున్నాయి. MacRumors నివేదిక ప్రకారం, రాబోయే 2022 iPhone SE 5G సాంకేతికతతోపాటు మెరుగైన A-సిరీస్ చిప్‌తో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. కానీ, పెద్దగా డిజైన్‌లో మార్పులు ఉండవని తెలుస్తోంది.

ఐఫోన్ SE 5Gకి మద్దతు ఇచ్చే మొదటి SE-సిరీస్ ఐఫోన్ అని నమ్ముతున్నారు. 2022 iPhone SE సంవత్సరం మొదటి అర్ధభాగంలో విడుదల కానుంది. ఈఫోన్ 3GB ర్యామ్ కలిగి ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే 2023 iPhone SE పెద్ద డిస్‌ప్లే, 4GB ర్యామ్‌తోనూ రావచ్చుననే వార్తలు వినిపిస్తున్నాయి.

iPhone SE 2022 ఫీచర్లు..

డిస్ప్లే విశ్లేషకుడు రాస్ యంగ్ మాట్లాడుతూ, ఆపిల్ 5G కనెక్టివిటీతో 2022లో కొత్త 4.7-అంగుళాల iPhone SE కోసం పని చేస్తుందని, దాని తర్వాత 5.7-అంగుళాల నుంచి 6.1-అంగుళాల LCD డిస్‌ప్లేతో సక్సెసర్ iPhone SE 2024లో వస్తుందని తెలిపాడు.

iPhone XR లేదా iPhone 11 డిజైన్‌తో కూడిన iPhone SE రెండేళ్ల తర్వాత 2024లో రావచ్చని నివేదిక పేర్కొంది. Apple iPhone SE సిరీస్ మొదటిసారిగా 2016లో విడుదలయింది.దాని రెండవ వెర్షన్ 2020లో విడుదలైంది. 2020లో, Apple iPhone SEని కొత్త A13 బయోనిక్ చిప్‌సెట్‌తో రిఫ్రెష్ చేసింది.

ఐఫోన్ SE కొత్త మోడల్‌లో ప్రత్యేకత?

Apple iPhone SE 2020ని కొత్త ఇంటర్నల్‌లతో రిఫ్రెష్ చేసినట్లే, iPhone SE 2022తో కూడా అదే పని చేయవచ్చు. దీని అర్థం iPhone SE 2022 5G మద్దతుతో వస్తుంది. A14 లేదా A15 వంటి కొత్త A-సిరీస్ ప్రాసెసర్, రిఫ్రెష్ చేసిన కెమెరా సెన్సార్, అలాగే సరికొత్త రంగుల్లో కొత్త ఐఫోన్ ఎస్‌ఈ 2022 రానుంది. ఐఫోన్ SE 2022 గురించిన మరిన్ని వివరాలతోపాటు స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ మరికొద్ది రోజుల్లో వెల్లడికానున్నాయి. సాధారణంగా కొత్త ఆపిల్ ఐఫోన్ సిరీస్ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో లాంచ్ అవుతుంది. మరి ఈ ఫోన్ కూడా 2022 సెప్టెంబర్‌‌లో విడుదలవుతుందా? అందకుముందే రిలీజ్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories