Infinix Laptop: ఇన్‌ఫినిక్స్‌ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్‌.. ధర, ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Infinix Inbook y1 Plus Laptop Check for All Details
x

Infinix Laptop: ఇన్‌ఫినిక్స్‌ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్‌.. ధర, ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Highlights

Infinix Laptop: ఇన్‌ఫినిక్స్‌ నుంచి సరికొత్త ల్యాప్‌టాప్‌.. ధర, ఫీచర్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Infinix Laptop: ఇన్‌ఫినిక్స్‌ ఇండియాలో ఓ కొత్త ల్యాప్‌టాప్‌ని విడుదల చేయనుంది. దీనికి Infinix INBook Y1 Plus అని పేరు పెట్టారు. ల్యాప్‌టాప్ ఫ్లిప్‌కార్ట్‌లో టీజ్ చేశారు. కంపెనీ తన మొబైల్ యాప్‌లో మాత్రమే ల్యాప్‌టాప్ మైక్రోసైట్‌ను ఉంచింది. ఇది అద్భుతమైన ఫీచర్లతో వస్తుంది. INBook Y1 Plus ప్రారంభ తేదీని ఇంకా వెల్లడించలేదు. దీని ధర, ఫీచర్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

Infinix INBook Y1 Plus FHD + రిజల్యూషన్‌తో 15.6-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ల్యాప్‌టాప్ 250 నిట్స్ బ్రైట్‌నెస్, 86 శాతం sRGB కలర్ గామట్‌ను అందిస్తుంది. ల్యాప్‌టాప్‌లో 2W సౌండ్ అవుట్‌పుట్ అందించే డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లు ఉంటాయి. మెషీన్ 50Whr బ్యాటరీ యూనిట్‌తో పవర్ చేయబడి ఉంటుంది. ఇది 10 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

Infinix INBook Y1 Plus ధర వెల్లడైంది. ఇది ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ నెలాఖరులో రూ.30,000 సెగ్మెంట్లో లాంచ్ కానుంది. ల్యాప్‌టాప్‌లతో పాటు Infinix స్మార్ట్ 7 స్మార్ట్‌ఫోన్‌ను కూడా త్వరలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. దీని ధర దాదాపు రూ.7,500గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ లలో కొనుగోలు చేస్తే మరింత తక్కువకి వచ్చే అవకాశం ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories