Infinix Hot 10 Play: 6000 mAh బ్యాటరీతో ఇన్‌ఫీనిక్స్ హాట్ 10 ప్లే రిలీజ్

Infinix Hot 10 Play: బిగ్ బ్యాటరీతో ఇన్‌ఫీనిక్స్ హాట్ 10 ప్లే స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది.

Venkata Chari
Published on: 19 April 2021 6:33 PM IST
Infinix Hot 10 Play Launched in India With 6000 mah Battery
X

ఇన్‌ఫీనిక్స్ హాట్ 10 ప్లే (ఫొటో ట్విట్టర్)

Infinix Hot 10 Play: బిగ్ బ్యాటరీతో ఇన్‌ఫీనిక్స్ హాట్ 10 ప్లే స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధర రూ.8499. మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌ అందించారు.

4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499గా ఉంది. అయితే 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఫోన్ కూడా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ, ఈ వేరియంట్ ఎప్పడు రిలీజ్ అవుతుందో తెలియరాలేదు. ఏప్రిల్ 26 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ జరగనుందని కంపెనీ వెల్లడించింది. మొరాండీ గ్రీన్, 7 డిగ్రీ పర్పుల్, ఏగన్ బ్లూ, ఆబ్సిడియన్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది.

ఇందులో 6.82 అంగుళాల హెచ్‌డీ+ టీఎఫ్‌టీ డిస్ ప్లేతోపాటు వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను అందించారు. 2.3 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా మరో 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.

వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. 13 మెగాపిక్సెల్ కెమెరా, మరో ఏఐ లెన్స్ అందించారు. క్వాల్ ఎల్ఈడీ ఫ్లాష్, స్లో మోషన్ వీడియో టెక్నాలజీ, డాక్యుమెంట్ మోడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ‌్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరాతోపాటు ఫ్లాష్ కూడా ఉంది. ఏఐ పొర్‌ట్రెయిట్, 3డీ బ్యూటీ ఫేస్ మోడ్, వైడ్ సెల్ఫీ మోడ్, ఏఆర్ యానిమోజీ, ఏఆర్ ఫేస్ మోషన్ ఫీచర్లు ఇచ్చారు.

ఇందులో 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అందించారు. పవర్ మారథాన్ టెక్నాలజీ కూడా ఉంది. దీని ద్వారా ఫోన్ బ్యాటరీ బ్యాకప్ 25 శాతం పెరగనుంది. జీపీఎస్, వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎఫ్ఎం రేడియో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.

Venkata Chari

Venkata Chari

Next Story